Site icon NTV Telugu

Bhatti Vikramarka: గత పదేళ్ల నుండి బీఆర్ఎస్ హయాంలో ఒక్క అభివృద్ధి జరగలేదు..

Batti

Batti

ఖమ్మం జిల్లా వేంసూరు మండలం మర్లపాడు సెంటర్ లో కాంగెస్ పార్టీ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్ లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వర రావు, సత్తుపల్లి కాంగ్రెస్ పార్టీ నియోజక అభ్యర్థి డాక్టర్ రాగమయి దయానంద్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. సత్తుపల్లి శాసనసభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని అన్నారు. డాక్టర్ రాగమయి దయానంద్ లు ప్రజా సేవ చేసిన నాయకులని తెలిపారు. కొంతమంది పారిశ్రామిక వేత్తలు సంచులతో డబ్బులు వెదజల్లి విచ్చలవిడిగా చేస్తుందని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్, తెలుగుదేశం హయాంలో మాత్రమే అభివృద్ధి జరిగిందని భట్టి విక్రమార్క అన్నారు. గత పది సంవత్సరాల నుండి బీఆర్ఎస్ హాయంలో ఒక్క అభివృద్ధి జరగలేదని విమర్శించారు. పందిక్కొక్కుల్లాగ దోపిడీ చేసి తెలంగాణ సంపదను దోచుకున్నారని భట్టి మండిపడ్డారు.

Read Also: Rahul Gandhi: బీఆర్‌ఎస్‌, బీజేపీ ఇద్దరి లక్ష్యం కాంగ్రెస్‌ను ఓడించడమే..

ఈ సందర్భంగా.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులందరూ భారీ మెజారిటీతో గెలుపొందనున్నారు… ప్రభుత్వం మనమే ఏర్పాటు చేస్తున్నామని భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. గత ఐదు సంవత్సరాలుగా కేసీఆర్ ప్రభుత్వం రుణమాఫీ చెయ్యలేదని.. కేసీఆర్ కి బుద్ది ఉందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి రైతుకు ఎకారానికి రూ.15000 ఇస్తాం.. బోనస్ గా 500, రైతుకూలీలకు 12000 ఇస్తామన్నారు. అంతేకాకుండా.. ఇల్లు నిర్మాణానికి ఐదు లక్షలు ఇస్తామని తెలిపారు. ఫీజు రీఎంబర్స్ మెంట్ విద్యార్ధులకు ఇస్తాం.. నిరుద్యోగం లేకుండా చేస్తామన్నారు. ఇవే కాక.. 200 యూనిట్లు కరెంట్ ఉచితంగా ఇస్తామన్నారు.

Read Also: Mansoor Ali Khan: త్రిషపై కామెంట్స్ కలకలం.. ఖుష్బూ, చిరంజీవిలపై పరువు నష్టం దావా

ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ మేనిఫెస్ట్ ఎలా సాధ్యం అయింది అని కేసీఆర్, కేటీఆర్ ప్రశ్నిస్తున్నారని భట్టి విక్రమార్క తెలిపారు. వారికి సిగ్గుండాలి.. ఈ రాష్ట్రంలో సంపద బాగా ఉంది కానీ, కేసీఆర్ కుటుంబం పందికొక్కుల్లా మెక్కారు కాబట్టే అమలు చేయలేకపోయారన్నారు. ఈ ఎన్నికలు దొరలకు ప్రజల మధ్య జరిగే పోరాటం అని రాహుల్ గాంధీ అన్నారని తెలిపారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవాలన్నది ప్రజలు ఆకాంక్ష అని పేర్కొన్నారు. అందుకోసమని సత్తుపల్లిలో రాగమయిని భారీ మెజారిటీతో గెలిపించాలని భట్టి విక్రమార్క కోరారు.

Exit mobile version