ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో సభ్య సమాజం అసహ్యించుకునే ఘటనలో కోర్టు ఇద్దరికి జీవిత ఖైదు శిక్ష విధించింది. మామ, కోడలు వివాహేతర బంధాన్ని చూసిన చిన్నారిని ఇద్దరూ కలిసి హత్య చేశారు. ఈ కేసులో సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత దోషులిద్దరికీ జీవిత ఖైదు విధించింది కోర్టు. ఈ వృద్ధుడి పేరు నరసింహారావు. ఇద్దరి స్వస్థలం ఖమ్మం జిల్లా బోనకల్లు. నిజానికి వీరిద్దరూ మామా కోడళ్లు. ఇద్దరికీ వివాహేతర బంధం ఉంది..
Accident: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం ఓసి 2 సమీపంలో నేషనల్ హైవే పై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుండి రాజమండ్రి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఖమ్మం వైపు వెళ్తున్న లారీ ఢీ కొట్టింది..ఈ ప్రమాదంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ముందు క్యాబిన్ భాగం పూర్తిగా ధ్వంసం అయింది..బస్సు డ్రైవర్ కు తీవ్ర గాయాలు అయి క్యాబిన్ లో ఇరుక్కుపోయ్యారు..మరో ఇద్దరు ప్రయాణికులకు తీవ్ర గాయాలు కావటంతో స్థానికులు సత్తుపల్లి ఆసుపత్రికి తరలించారు.…
Tummala Nageswara Rao : ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కాకర్ల పల్లి గ్రామంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ.. 40 ఏళ్ల చరిత్రలో ఎన్నో మార్పులు, ఎన్నో చేర్పులు జరిగాయన్నారు. సత్తుపల్లి ప్రజలకు ఎక్కడ ఉన్న రుణపడి ఉంటానని, నా నియోజకవర్గం కంటే సత్తుపల్లి కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ఆగిపోయిన సీతారామ ప్రాజెక్ట్‌ను కదిలిచ్చి గోదావరి జలాలు తమ్మిలేరు ద్వారా బెతుపల్లి…
గత ఎన్నికల్లో సత్తుమల్లి ఎమ్మెల్యేగా మట్టా రగమయి దయానంద్ గెలవడం చాలా సంతోషంగా ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి, అమ్మ ఫౌండేషన్ అధినేత మల్లు నందిని అన్నారు. ఆదివారం సత్తుపల్లిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సత్తుపల్లిలో ఎంత డబ్బులు వెదజల్లిన చివరికి ఆడబిడ్డకే సత్తుపల్లి ప్రజలకు పట్ట కట్టారన్నారు. సత్తుపల్లి లో కాంగ్రెస్ జెండా ఎగరవెయటానికి మట్టా రాగమయి దంపతులు చాలా తపన పడ్డారని…
ఖమ్మం జిల్లా వేంసూరు మండలం మర్లపాడు సెంటర్ లో కాంగెస్ పార్టీ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్ లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వర రావు, సత్తుపల్లి కాంగ్రెస్ పార్టీ నియోజక అభ్యర్థి డాక్టర్ రాగమయి దయానంద్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. సత్తుపల్లి శాసనసభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని అన్నారు. డాక్టర్ రాగమయి దయానంద్ లు ప్రజా సేవ చేసిన నాయకులని…
ఖమ్మం జిల్లా కొమ్ముగడెం గ్రామం సత్తుపల్లి నియోజక వర్గంలో మాజీ ఎంపీ పొంగులేని వర్గీయుడైన సర్పంచ్ మాగంటి కృష్ణ బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తుండగా.. ఎమ్మెల్యే సండ్రా వర్గీయులు అడ్డుకున్నారు.
ఒక చోట ఉండి.. మరొకరితో కాపురం చేయద్దని టీఆర్‌ఎస్ నేతలపై తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంత మంది పార్టీని నాశనం చేయాలని చూశారని.. పార్టీ పరువు పోకుండా ఎమ్మెల్సీని గెలిపించారని తెలిపారు. ఒక చోట ఉండి మరొక చోట కాపురం చేయడం మంచిదికాదని ఇది అందరూ గుర్తు పెట్టుకోవాలని టీఆర్‌ఎస్ పార్టీలోని కొంతమంది నేతలను ఉద్దేశించి అన్నారు. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడబోమని… భవిష్యత్‌లో అందరూ కలిసి ప్రయాణం చేయాలని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.…