Flexi Politics: తమకు నచ్చిన నాయకుడు, మెచ్చిన లీడర్, అభిమానించే నటులు.. ఇలా ఎవరికి తోచినట్టుగా వారు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఇప్పుడు సాధారణంగా మారిపోయింది.. కొన్నిసార్లు ఏర్పాటు చేసే ఫ్లెక్సీలు కొత్త చర్చకు దారి తీస్తుంటాయి.. మరికొన్ని.. భవిష్యత్ రాజకీయాలను కూడా సూచిస్తుంటాయి.. అయితే, ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ముగ్గు వెంకటాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కొత్త రాజకీయ చర్చకు దారితీసింది..
Read Also: Nirmal District: కాశీ యాత్రకు వెళ్లిన వ్యక్తి సజీవ దహనం..
వెంకటాపురం గ్రామంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నటసింహ నందమూరి బాలకృష్ణ, బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఫొటోలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు గుర్తుతెలియని వ్యక్తులు.. ఆ దృశ్యాలు కాస్తా సోషల్ మీడియాకు.. ఆ తర్వాత మీడియాకు కూడా ఎక్కడంతో వైరల్‌గా మారిపోయాయి.. సంక్రాతి శుభాకాంక్షలు తెలుపుతూ సైకిల్ గుర్తు, కారు గుర్తులు వేసి తమ అభిమాన నాయకులు ఫొటోలను ఒకే ఫ్లెక్సీలో వేసి ప్రధాన రహదారి పక్కన ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం.. కల్లూరు మండలంలో హాట్ టాఫిక్ గా మారింది. ఆ ఫ్లెక్సీలల్లో చంద్రబాబు ఫొటో కింద బాస్ ఈజ్ బ్యాక్, బాలకృష్ణ ఫొటో కింద డాకు మహారాజ్, కేసీఆర్ ఫొటో కింద బాస్ ఈజ్ కమింగ్ సూన్.. అని క్యాప్షన్లు పెట్టాటంతో ఆసక్తి నెలకొంది.
Read Also: Rishabh Pant: రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైన రిషబ్ పంత్
ఇక, అదే ఫ్లెక్సీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఏపీ మంత్రి నారా లోకేష్, నందమూరి మోక్షజ్ఞ, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఫొటోలు కూడా ఈ ఫ్లెక్సీల్లో దర్శనం ఇస్తున్నాయి… దీంతో.. ఆ ఫ్లెక్సీ కాస్తా వైరల్ గా మారిపోయింది.. అయితే, ఎక్కడైనా.. తమ అభిమాన నేతలు, నటుల ఫొటోలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తే.. ఆ ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన వారి ఫొటోలు కూడా ఉంటాయి.. కానీ, ఆ ఫ్లెక్సీ విషయంలో మాత్రం అది జరిగలేదు.. కానీ, ఆ ఫ్లెక్సీ ఎవ్వరు పెట్టినా కల్లూరు మండలంలో రాజకీయంగా కొత్త రాజకీయ చర్చకు దారితీసినట్టు అయ్యింది.. గతంలో కేసీఆర్ కూడా టీడీపీలో పనిచేయడంతో.. టీడీపీ అభిమానులే ఎవరైనా ఈ ఫ్లెక్సీ పెట్టిఉంటారని భావిస్తున్నారు.. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అంటారు.. రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచిచూడాలి మరి..