Madhapur Drugs Case: మాదాపూర్ డ్రగ్స్ కేసు.. ఆ 18 మంది ఎవరు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhapur Drugs Case: నగరంలోని మాదాపూర్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు బృందాలు మరిన్ని విస్తుగొలిపే వాస్తవాలను కనుగొన్నాయి. మాదాపూర్‌లోని ఓ అపార్ట్మెంట్లో రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారనే సమాచారంతో యాంటీ నార్కోటిక్స్ బృందం దాడులు చేసింది. సినిమా ఫైనాన్షియర్ వెంకట్, బాలాజీ తదితరులను అరెస్టు చేశారు. వెంకట్‌పై తెలుగు రాష్ట్రాల్లో 25కు పైగా కేసులున్నట్లు దర్యాప్తు బృందం గుర్తించింది. వెంకట్ ఐఆర్ఎస్ అధికారిగా నటించి మోసానికి పాల్పడినట్లు విచారణ అధికారుల దృష్టికి వచ్చింది. సినీ నిర్మాతలు సి.కళ్యాణ్, రమేష్‌ల నుంచి వెంకట్ ఐఆర్ఎస్ అధికారిగా నటించి డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.
ఐఆర్ఎస్ అధికారిగా నటిస్తూ అమ్మాయిలను కూడా మోసం చేసినట్లు దర్యాప్తు బృందాలు గుర్తించినట్లు సమాచారం. ఏపీకి చెందిన ఓ ఎంపీ పేరు చెప్పి వెంకట్ డబ్బులు వసూలు చేసినట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. మరోవైపు సినిమాల్లో అవకాశాలు వస్తాయనే ఆశతో మహిళలతో వ్యభిచారం చేయిస్తున్నారని పోలీసులు కూడా తమ విచారణలో తేల్చారు. సినీ, రాజకీయ ప్రముఖులతో కలిసి వారాంతపు పార్టీలు నిర్వహిస్తూనే వారిని కొట్టినట్లు విచారణలో తేలింది. వెంకట్‌పై గతంలో వివాహేతర కేసులు కూడా ఉన్నాయని పోలీసులు గుర్తు చేస్తున్నారు.
Also Read
- Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ అపార్ట్మెంట్లో వివిధ రకాల డ్రగ్స్‌ను యాంటీ నార్కోటిక్స్ బృందం గుర్తించింది. నిందితుడి వాట్సాప్ చాటింగ్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. డ్రగ్స్‌ను ఎవరు ఎవరికి విక్రయించారనే దానిపై దర్యాప్తు బృందాలు ఆరా తీస్తున్నాయి. 18 మందికి డ్రగ్స్ విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ 18 మంది ఎవరనే కోణంలో దర్యాప్తు బృందాలు ఆరా తీస్తున్నాయి. బాలాజీ, వెంకట్ వ్యవహారంలో డ్రగ్స్ వినియోగించిన 18 మంది జాబితాను పోలీసులు సిద్ధం చేశారా ? ఈ వ్యవహారంలో నార్కోటిక్ బ్యూరో మరోసారి నిందితుల్ని కస్టడీకి తీసుకొని విచారణ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.
Read also: Vijay varma : ఆ అభిమాని అడిగిన ప్రశ్నకు మండిపడిన విజయ్ వర్మ..
గతంలో సినీ నిర్మాత కృష్ణ ప్రసాద్ అరెస్టు తర్వాత మరోసారి టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టించాయి. కృష్ణ ప్రసాద్ లిస్టులో సినీ ప్రముఖులు, రాజకీయ, ఇతర రంగాల వ్యక్తులకు డ్రగ్స్ సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. కృష్ణ ప్రసాద్ వ్యవహారంలో సినీ పరిశ్రమకు చెందిన కొందరు పేర్లు జాబితా అప్పట్లో సిద్దం చేసిన విషయం తెలిసిందే.. దర్యాప్తుకు సిద్ధమైన సమయంలో పై స్థాయి నుండి పోలీసులపై ఒత్తిడి షురూ అయ్యింది. కృష్ణ ప్రసాద్ వ్యవహారంలో విచారణ నిలిచి పోయింది. అయితే కృష్ణ ప్రసాద్ సినీ ఫైనాన్సర్ వెంకటరత్నం రెడ్డి ,బాలాజీకి ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో విచారణ కొనసాగుతుంది. నిర్మాతలు సి. కల్యాణ్, రమేష్‌ల నుంచి ఐఆర్ఎస్ అధికారినంటూ వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.
వెంకటరత్నారెడ్డి నిర్మాతల నుంచి రూ.30 లక్షలకుపైగా కొట్టేసినట్లు దర్యాప్తులో తేలింది. ఒక ఐఆర్ఎస్ అధికారినిసైతం పెళ్లి పేరుతో మోసానికి పాల్పడినట్లు గుర్తించారు. సినిమాలో అవకాశాల పేరిట అమ్మాయిలకు వల వేయడం, ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను రప్పించి వ్యభిచారం చేయిస్తున్నట్లు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పెళ్లి పేరుతో ఎన్ఆర్ఐ నంటూ విదేశీ యువతలను వెంకట్ మోసం చేసినట్లు తేలింది. ఏపీకి చెందిన ఓ ఎంపీ పేరు చెప్పి వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. హైదరాబాద్‌లో సినీ, రాజకీయ నాయకులను పార్టీలకు పిలిచి బురిడీ కొట్టిస్తున్న వెంకట్ కాంటాక్ట్‌లో ఉన్న వాళ్లను ప్రశ్నించేందుకు రంగం సిద్ధం చేసిన పోలీసులు.
Petrol Prices: లీటర్ పెట్రోల్ ధర రూ. 300.. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో దాయాది
తాజావార్తలు
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
-
Aafiya Sayed : టాలీవుడ్లోకి బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఇంట్రడ్యూస్
-
Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!