చెప్పేవి శ్రీరంగనీతులు... దూరేవి దొంగ గుడిసెలు అన్నట్టుంది అతగాడి యవ్వారం !! గుడి ఎనకా నా సామీ.. అన్నట్టు దేవుడి చాటున గలీజ్ దందా నడుపుతున్నాడు !! ఇంట్లో పూజలు.. హోమాలు చేస్తున్నట్లు కలరింగ్ ఇచ్చాడు కేటుగాడు. అనుమానంతో ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు షాక్ అయ్యారు. ఇంతకూ అతగాడి ఇంట్లో ఏం దొరికింది..?
డ్రగ్స్ కేసులో హైదరాబాద్ కమినషర్ సీవీ ఆనంద్, ఎస్పీ సునీత రెడ్డి నేతృత్వంలో టీం బాగా పనిచేస్తోంది అని నవదీప్ ప్రశంసించారు. రామచంద్ అనే వ్యక్తి నాకు పరిచయం ఉన్నమాట వాస్తవమే.. కానీ, నేను ఎక్కడా డ్రగ్స్ తీసుకోలేదు అని అతడు చెప్పాడు.
మాదాపూర్ డ్రగ్స్ కేసులో సినీ నటుడు నవదీప్ పోలీసుల ఎదుట హాజరై విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా నవదీప్ ను నార్కోటిక్ బ్యూరో అధికారులు గత ఐదు గంటలుగా విచారిస్తున్నారు. దేవరకొండ సురేష్, రామచంద్రలతో పరిచయాలపై నార్కోటిక్ అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు.
Madhapur Drugs Case: నగరంలోని మాదాపూర్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు బృందాలు మరిన్ని విస్తుగొలిపే వాస్తవాలను కనుగొన్నాయి. మాదాపూర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారనే సమాచారంతో యాంటీ నార్కోటిక్స్ బృందం దాడులు చేసింది.