అసలు ముందస్తుకు వెళ్లే ఆలోచనే లేదని స్పష్టం చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్.. ఇదే సమయంలో అసెంబ్లీ స్థానాల్లో సర్వేలు జరుగుతున్నాయని తెలిపారు.. ఆరు నూరైనా ఈసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లబోమన్న ఆయన.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 95 నుంచి 105 సీట్లు గెలుస్తాం అని ధీమా వ్యక్తం చేశారు. అయితే, కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నారు బీజేపీ నేతలు.
ఎన్నికలు, సీట్లపై స్పందించిన బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్… కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ పార్టీ.. వచ్చే ఎన్నికల్లో వంద సీట్లలో ఓడిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక, బీజేపీలో ఎవరూ అసంతృప్తితో లేరన్న ఆయన.. కాంగ్రెస్ దేశ వ్యాప్తంగా వెంటిలేటర్ మీద ఉందని.. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కి కాంగ్రెస్ పార్టీ బీ టీమ్‌గా పనిచేస్తోందని విమర్శించారు. మరోవైపు.. ధాన్యం సేకరణపై కేసీఆర్ పాలసీ ఏంది..? అని ప్రశ్నించారు తరుణ్ చుగ్.. బంగారు తెలంగాణ బీజేపీతోనే సాధ్యమన్న ఆయన.. కరోన టైమ్‌లో కేసీఆర్ చేసిందేమిటి? అని మండిపడ్డారు.. ఆయన గురించి అందరికి తెలుసు అని ఎద్దేవా చేశారు.
Read Also: Ukraine Russia War: అసహనంతో రష్యా.. దాడులు తీవ్రం..