KCR Protest: నేడు బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్త నిరసన.. శ్రేణులకు కేసీఆర్ పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KCR Protest: నేడు రాష్ట్ర వ్యాప్తంగా నియోజక వర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలకు నిరసన తెలపాలని సూచించారు. పార్లమెంటు ఎన్నికలు ముగిసిన అనంతరం వరి ధాన్యానికి క్వింటాలుకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తానని కాంగ్రేస్ ప్రభుత్వం ప్రకటించి ఇప్పుడు సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం రైతాంగాన్ని మరోసారి వంచించడమే అన్నారు.
కాంగ్రెస్ సర్కార్ రైతులకు మోసం, దగా చేయడమేనని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 90 శాతం రైతులు దొడ్డు వడ్లనే పండిస్తారు. ఈ విషయం తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎలా ప్రకటిస్తుంది? అని ప్రశ్నించారు. సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం ద్వారా తెలంగాణ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి వంచించిందన్నారు. ఓట్లు డబ్బాలో పడంగనే కాంగ్రెస్ వాళ్లకు రైతుల అవసరం తీరిందన్నారు. అందుకే నాలిక మల్లేసి ఎప్పటి మాదిరిగానే నయవంచనకు పూనుకున్నారు.
Also Read
- Shabad: 48 గంటలు దాటినా దొరకని నిందితుడు.. రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు.!
- TG20 తొలి ఛాంపియన్‌గా 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్'.. ఖమ్మం ఏసెస్‌పై 6 వికెట్లతో ఘన విజయం.!
- Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
- Shabad Murders : షాబాద్ హంతకుడు రాజ్‌కుమార్ వేటలో విస్తుపోయే నిజాలు
Read also: Bollywood Hero : భార్య పేరున్న టాటూను తొలగించిన హీరో..విడాకులు తీసుకోబోతున్నారా?
ఇదే సన్న వడ్లకు మాత్రమే అనే మాట ఎన్నికలకు ముందు గనుక చెప్పింటే కాంగ్రెస్ పార్టీని రైతులు తుక్కు తుక్కు చేసేవాళ్లని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికీ ప్రజలు కాంగ్రెస్ పై ఆగ్రహం తోనే ఉన్నారు. రైతు బంధు, రైతు భరోసా ఇవ్వకుండా రైతాంగాన్ని అన్నిరకాలుగా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందన్నారు. అందు కారణంగానే రైతాంగ హక్కులను హామీలను సాధించేందుకే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టిందని కేసీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రైతులపక్షాన నిలబడి కొట్లాడాలని పిలుపునిచ్చారు.
ఇప్పటికీ కొనుగోలు కేంద్రాల్లో వడ్లను కొనడానికి నిర్లక్ష్యం వహిస్తూ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఏడిపిస్తూ గోస పుచ్చుకుంటుందన్నారు. రాష్ట్ర రైతాంగానికి భరోసా కల్పించేదిశగా నిరసన కార్యక్రమాలతో పాటు.. ప్రతిరోజూ వడ్ల కల్లాలకాడికి బీఆర్ఎస్ శ్రేణులు పోవాలని, రైతులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. రైతుల హక్కులను కాపాడేందుకు వారికి అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని కేసీఆర్ పునరుద్ఘటించారు. ఈనేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక చర్యలకు నిరసనగా.. రాష్ట్ర వ్యాప్త నిరసనకు కేసీఆర్ పిలుపు ఇచ్చారు.
AP EAPCET: నేటి నుంచే ఏపీ ఈఏపీసెట్.. నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరణ!
తాజావార్తలు
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
Mercedes E53 Hybrid: మెర్సిడెస్ కొత్త కారు.. పెట్రోల్ లేకుండానే 100KM రేంజ్, 3.8 సెకన్లలో 100 kmph స్పీడ్
-
Vietnam Boat Tragedy: నేడు భారత్‌కు 15 మంది భారతీయుల మృతదేహాలు.!
-
Vaibhav Sooryavanshi: బ్లాక్ సూట్, సన్‌గ్లాసెస్.. అదిరిపోయిన వైభవ్ లుక్.! వింబుల్డన్ ఫైనల్లో భారత క్రికెట్ త్రయం సందడి.!
-
Hema Malini Biopic: హేమ మాలిని బయోపిక్ లో హీరోయిన్ గా దీపికా పడుకోణె? మనసులో మాట చెప్పిన డ్రీమ్ గర్ల్!
ట్రెండింగ్
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
-
iPhone 17 Demand: సీన్ రివర్స్.. ఐఫోన్ 17 సిరీస్‌కు ఊహించని డిమాండ్.. అసలు కారణం ఏంటో తెలుసా?
-
Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
-
Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్!
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!