మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, మెగా స్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ మహేష్ బాబు, రెబల్ స్టార్ ప్రభాస్ ల పేర్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెట్ ఫ్లిక్స్ సీఈవో టెడ్ సరండోస్ మన స్టార్స్ హీరోస్ ని కలవడంతో ఆ ఫోటోస్ ని ట్రెండ్ చేస్తూ అభిమానులు సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. చరణ్, చిరు, ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్ ల తర్వాత టెడ్ కలిసిన హీరోల లిస్టులో అల్లు అర్జున్ కూడా కలిసాడు. అల్లు అర్జున్ ని గత రాత్రే కలిసాడు టెడ్ సరండోస్. చిరు చరణ్ తో బ్రేక్ ఫాస్ట్, ఎన్టీఆర్ తో లంచ్ చేసిన తర్వాత టెడ్… అల్లు అర్జున్ ని డిన్నర్ కి కలిసాడు. ఈ సంధర్భంగా తీసిన ఫోటోలు ఇప్పుడు బయటకి వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అల్లు అర్జున్ తో పాటు అల్లు అరవింద్, సుకుమార్, మైత్రీ మూవీస్ మేకర్స్ ప్రొడ్యూసర్స్ కూడా టెడ్ సరండోస్ తో మీటింగ్ లో పాల్గొన్నారు. అయితే టెడ్ సరండోస్… చిరుని కలిసాడు, చరణ్ ని కలిసాడు, ఎన్టీఆర్ ని కలిసాడు, మహేష్ బాబుని కలిసాడు, ప్రభాస్ ని కలిసాడు అని కాకుండా కొంచెం దూరం అలోచించి చూస్తే అసలు విషయం అర్ధమవుతుంది. గేమ్ ఛేంజర్, దేవర, గుంటూరు కారం, కల్కి, పుష్ప 2 టీమ్ లని టెడ్ సరండోస్ కలిసాడు. సౌత్ ఇండియా నుంచి పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేయబోతున్న ఈ సినిమాల ఓటీటీ డబ్బులకి సంబంధించిన విషయం మాట్లాడడానికి టెడ్ సరండోస్ ఇండియా వచ్చినట్లు ఉన్నాడు. మరి ఈ లిస్టులో ఇంకెంతమంది హీరోలని కాలుస్తాడు అనేది చూడాలి.