KCR Road Show: తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావుడి జరుగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో 8 నుంచి 12 సీట్లను అధిక శాతం కైవసం చేసుకునేందుకు గులాబీ పార్టీ ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే మహబూబాబాద్ జిల్లాలో కేసీఆర్ రోడ్డు షో నిర్వహించనున్నారు. భద్రాద్రి కొత్తగూడెం నుండి మహబూబాబాద్ కు కేసీఆర్ రానున్నారు. ఇల్లందు రోడ్డులోని ధరణి ఆసుపత్రి నుండి ఇందిరాగాంధీ సెంటర్ వరకు రోడ్డు షో నిర్వహిస్తారు. ఇందిరాగాంధీ సెంటర్ లో సాయంత్రం 6 గంటలకు కార్నర్ మీటింగ్ లో మాట్లాడనున్నారు. మహబూబాబాద్ నుండి రాత్రి వరంగల్ కు కేసీఆర్ చేరుకుంటారు. అనంతరం రాత్రి వరంగల్ లోనే కేసీఆర్ అక్కడే బస చేయనున్నారు.
Read also: Uttarakhand : 24 గంటల్లో 68 చోట్ల అగ్నిప్రమాదాలు.. అటవీశాఖకు రూ.20లక్షల కోట్ల నష్టం
కేసీఆర్ బస్సు యాత్రలో భాగంగా నిన్న (మంగళవారం) ఖమ్మం జిల్లాలో పర్యటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కొత్తగూడెం జిల్లా వుండాలంటే బీఆర్‌ఎస్ గెలవాలన్నారు. కాంగ్రెస్‌కు సురుకు పెట్టాలన్నారు. అడ్డగోలుగా వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేసింది కాంగ్రెస్ అని కేసీఆర్ మండిపడ్డారు. ఈ రోజు కరెంట్ రావడం లేదని, రెప్ప పాటు పోకుండా నేను ఇచ్చాననన్నారు. దొంగతోపు గ్రామానికి కరెంట్ మా హాయం లో ఇచ్చానని, కొత్తగూడెం జిల్లాలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయంలో అతి ఎక్కువ పోడు పట్టాలు ఇచ్చామని, యుద్ధం పోరాటం చేయడానికి మీరంతా సిద్ధంగా వుండాలన్నారు. గిరిజనుల కోసం బంజారా హిల్స్ లో కోట్ల రూపాయల తో బంజారా భవన్ కట్టించామన్నారు. ఆస్ట్రేలియా నుంచి బొగ్గు తీసుకోవాలని నరేంద్ర మోడీ వత్తిడి తెస్తే నేను ఒప్పుకోలేదని, రైతు బంధు రాలేదు రుణ మాఫీ రాలేదన్నారు. జిల్లాను తీసివేస్తమని అంటున్నారని, మోడీ బీజేపీ ప్రభుత్వం ఒక్క హామీ నెరవేర్చ లేదన్నారు.
Faria Abdullah: ప్రభాస్ ఎక్కడికెళ్లినా వాళ్ళు ఉండాల్సిందే.. సీక్రెట్ బయటపెట్టిన చిట్టి!