Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Kcr Review On Brs Party Silver Jubilee Celebration

KCR: బీ‌ఆర్‌ఎస్ రజతోత్సవ వేడుకలు.. వరంగల్‌లో భారీ బహిరంగ సభ

Published Date :March 7, 2025 , 9:16 pm
By Venkatesh
  • బీ‌ఆర్‌ఎస్ రజతోత్సవ వేడుకలు
  • వరంగల్ లో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ
  • రజతోత్సవ వేడుకల్లో తెలంగాణ సమాజమంతా భాగస్వాములే
  • తెలంగాణ సమాజం గర్వించేలా వేడుకలు
KCR: బీ‌ఆర్‌ఎస్ రజతోత్సవ వేడుకలు.. వరంగల్‌లో భారీ బహిరంగ సభ
  • Follow Us :
  • google news
  • dailyhunt

బీఆర్ఎస్ ఆవిర్భవించి 25 ఏళ్లు అవుతున్న వేళ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా జరిపేందుకు పార్టీ శ్రేణులు రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏప్రిల్ 27న జ‌ర‌గ‌బోయే బ‌హిరంగ స‌భ‌పై పార్టీ నేత‌ల‌తో కేసీఆర్ సుధీర్ఘంగా చ‌ర్చించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను మొదటి నుంచి కాపాడుకుంటూ వస్తున్న బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణ సమాజానికి రక్షణ కవచం అని, ఈ విషయం గత పద్నాలుగు నెల్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ద్వారా మరోసారి స్పష్టమైందని, అందుకు తెలంగాణ సమాజంలో రాష్ట్ర ప్రభుత్వం పట్ల ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి అనిశ్చితే నిదర్శనమని బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ పునరుద్ఘాటించారు.

Also Read:SSMB 29: జక్కన్న సినిమాలో మహేష్ పేరు లీక్!?

బీఆర్ ఎస్ పార్టీ ఆవిర్భవించి 27 ఏప్రిల్ తేదీకి 25 ఏండ్లు కావస్తున్న నేపథ్యంలో నిర్వహించే రజతోత్సవ వేడుకల్లో భాగంగా.. వరంగల్ జిల్లాలో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని అధినేత కేసీఆర్ నిర్ణయించారు. ఈమేరకు వరంగల్ సమీపంలో విశాలమైన అనువైన ప్రదేశాలను పరిశీలించి త్వరలో సభా వేదిక స్థలాన్ని నిర్ణయించనున్నట్టు కేసీఆర్ తెలిపారు. దశాబ్దాల పాటు పోరాటాలు నడిపి ఎన్నో త్యాగాలతో తెలంగాణను సాధించుకున్నామని, అనంతరం పదేండ్ల పాటు ఎంతో అప్రమత్తతో తెలంగాణ స్వరాష్ట్రంలో పాలనను దేశానికే ఆదర్శంగా నిలుపుకున్నామని, అంతటి గొప్ప ప్రగతిని సాధించిన తెలంగాణ సమాజం ఇవ్వాల కష్టాల్లో ఉందన్నారు.

Also Read:Donald Trump: ఇరాన్‌కి ట్రంప్ లేఖ.. అణు ఒప్పందంపై చర్చలు..

ఇటువంటి సందర్భంలో నిర్వహించుకుంటున్న రజతోత్సవ వేడుకలు, కేవలం బీఆర్ ఎస్ పార్టీకే పరిమితం కాదని యావత్ తెలంగాణ సమాజానికి అందులో భాగస్వామ్యం వుందని స్పష్టం చేశారు. ” బి ఆర్ ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలు నిర్మించుకున్న రాజకీయ అస్థిత్వ పార్టీ. ఇది తెలంగాణ ప్రజల పార్టీ… ప్రజలు బీఆర్ ఎస్ ను తెలంగాణ పార్టీగా తమ సొంత ఇంటి పార్టీ గా భావిస్తారు. ప్రజలు ఇవాళ అనేక కష్టాల్లో వున్నారు. వారి రక్షణ బీఆర్ ఎస్ పార్టీనే అని నమ్ముతున్నారు.” అని తెలిపారు. కాంగ్రెస్ ఆశపెట్టిన గ్యారెంటీలను వాగ్దానాలను నమ్మిన ప్రజలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ నిజ స్వరూపాన్ని తెలుసుకున్నారని, ఇక ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ ఎస్ కు బ్రహ్మరథం పట్టేందుకు సిద్ధంగా ఉన్నారని కేసీఆర్ అన్నారు.

Also Read:TGPSC: గ్రూప్స్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఫలితాల విడుదల తేదీలు ఫిక్స్

ఈ సందర్బంగా వరంగల్ లో నిర్వహించే భారీ బహిరంగ సభకు లక్షలాదిగా ప్రజలు తరలివస్తారని సమావేశంలో ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా.. బహిరంగ సభ సన్నాహక సమావేశాలను నియోజక వర్గాల వారీగా నిర్వహించాలని అందుకు త్వరలో కమిటీలను వేయనున్నట్టు కేసీఆర్ తెలిపారు. వరంగల్ బహిరంగ సభ అనంతరం.. పార్టీనీ గ్రామ స్థాయినుంచి రాష్ట్ర స్థాయి వరకు సంస్థాగతంగా పటిష్ట పరిచి, ఆ దిశగా కొత్త కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. ఆ తర్వాత.. నూతన కమిటీల బాధ్యులతో.. ప్రతినిధుల సభను ఏర్పాటు చేయనున్నట్టు కేసీఆర్ తెలిపారు.

Also Read:Donald Trump: ఇరాన్‌కి ట్రంప్ లేఖ.. అణు ఒప్పందంపై చర్చలు..

కాగా.. పార్టీలో యువత, మహిళా భాగస్వామ్యం పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంతో పాటు, దేశంలో నడుస్తున్న వర్తమాన రాజకీయ పరిస్థితులపై సమావేశంలో సుధీర్ఘ చర్చ జరిగింది. అందుకనుగుణంగా పార్టీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన వ్యూహాలు అమలుచేయాల్సిన రాజకీయ ఎత్తుగడల పై లోతైన చర్చ జరిగింది. గత ఒడిదుడుకులను అనుభవాలను పరిగణలోకి తీసుకుని వాటిని విశ్లేషిస్తూ, వర్తమానానికి అన్వయించుకుంటూ భవిష్యత్తు కు బాటలువేసుకునే విధంగా కార్యాచరణను అమలు పరచాలని సమావేశంలో నిర్ణయించారు.

Also Read:TGPSC: గ్రూప్స్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఫలితాల విడుదల తేదీలు ఫిక్స్

కేంద్రం లో ఏపార్టీ ప్రభుత్వమున్నకూడా, తెలంగాణ సమాజానికి మొదటినుంచీ అవి వ్యతిరేకంగానే పని చేస్తున్నాయని సమావేశంలో ఆవేదన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్రం లో పార్టీనీ పటిష్టం చేసుకొని దేశ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాల పట్ల నిత్యం అప్రమత్తతతో ఉండాలని సూచించారు. తెలంగాణ ఇంటి పార్టీ ప్రాతినిథ్యం పార్లమెంటులో లేకపోవడం వలన తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని ప్రజలకు మరింతగా అర్ధం చేయించి పార్లమెంటులో బీఆర్ ఎస్ ఎంపీ లు ప్రాతినిథ్యం వుండి రాష్ట్ర హక్కులను కాపాడుకునే దిశగా ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించాలని సమావేశంలో నిర్ణయించారు.

Also Read:YouTuber: గర్ల్‌ఫ్రెండ్‌ని, ఆమె తల్లిని ఒకేసారి గర్భవతులుగా చేసిన యూట్యూబర్.. నిజం ఏంటంటే..

కాగా పలు అంశాలపై చర్చ సంధర్బంగా అధినేత అందరి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో పాల్గొన్న నేతలు వారి వారి అభిప్రాయాలను అధినేత ముందుంచారు. దాదాపు ఎనిమిది గంటల పాటు సాగిన సుధీర్ఘ చర్చలో.. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దెబ్బతీస్తున్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల వైఖరులను తిప్పి కొడుతూ తెలంగాణ సమాజ ఆకాంక్షలకు అనుగుణంగా భారీ బహిరంగ సభను నిర్వహించాలని కేసీఆర్ అధ్యక్షతన సాగిన సమావేశం నిర్ణయించింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BRS Party
  • harish rao
  • kcr
  • ktr
  • Silver Jublee

తాజావార్తలు

  • Fuel Shortage: “అందుకే బంకుల్లో స్టాక్ ఖాళీ అవుతోంది”.. తెలంగాణ పెట్రోలియం డీలర్స్ బిగ్ వార్నింగ్

  • Redmi Note 15 SE 5G: రెడ్ మీ నోట్ 15 SE 5G లాంచ్ డేట్ కన్ఫర్మ్.. 5520mAh బ్యాటరీ & 108MP కెమెరా

  • IPL Owners List 2026: 10 ఐపీఎల్ జట్ల యజమానులు ఎవరో తెలుసా?.. ఫ్రాంచైజీల వెనుక ఉన్న పెద్ద పేర్లు ఇవే!

  • Brutal Murder in Arakuloy: హైదరాబాద్‌లో ఉద్యోగం.. అరకులో దారుణ హత్య.. భార్య గర్భవతి..

  • Petrol, Diesel Shortage: పెట్రోలు, డీజిల్ సరఫరాపై కేంద్ర మంత్రి సంచలన ప్రకటన.. వారికి వార్నింగ్..

ట్రెండింగ్‌

  • RCB Sale Price: ఐపీఎల్ చరిత్రలో మరో సంచలన డీల్.. ఆర్‌సీబీ కొత్త ఓనర్స్ ఎవరంటే?

  • Viral News: రేట్లు పెరిగాయి.. యుద్ధం ఆపిస్తే తగ్గిస్తాం.! వైరల్ అవుతున్న రెస్టారెంట్ బోర్డు

  • నెట్‌వర్క్ లేకుండానే కాల్స్ టెక్నాలజీ, 6500mah బ్యాటరీతో వచ్చేస్తున్న TECNO Spark 50 5G..!

  • Fridge Cleaning Tips: మీ ఫ్రిడ్జ్ నుంచి దుర్వాసన వస్తుందా..? ఈ ట్రిక్‌తో కొత్తదిలా మారుతుంది.!

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions