BJP: తిరుగుబాటు కోసమే వియత్నాంకు రాహుల్ గాంధీ.. బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణ.!
- ప్రభుత్వ మార్పుకు రాహుల్ గాంధీ కుట్ర..
- అందుకే విదేశాలకు వెళ్తున్నారు..
- బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర సంచలన ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: రాహుల్ గాంధీ విదేశాల్లో తిరుగుబాటుకు కుట్ర పన్నుతున్నారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర సంచలన ఆరోపణలు చేశారు. నవంబర్ 1న ప్రతిపక్షాలు భారీ నిరసనకు సిద్ధమవుతున్నాయని, దీని కోసం కుట్ర పన్నుతున్నారని బీజేపీ ఆరోపించింది. పదే పదే నిరసనలు చేసి ప్రభుత్వాన్ని మార్చేందుకు కుట్ర పన్నుతున్నారని అన్నారు. ప్రభుత్వాన్ని మార్చడమే ప్రతిపక్షాలు ఇప్పటికే స్పష్టం చేశాయని, దానిని సాధించడానికి హింస అవసరమని చాలా మంది నాయకులు చెబుతున్నారని ఆరోపించారు.
శివసేన యూబీటీ ఎంపీ సంజయ్ రౌత్ అల్బేనియా సుప్రీంకోర్టు తగలబడుతున్న ఫోటోలు షేర్ చేశారని, భారత్‌లో కూడా ఇదే జరగాలని ఆయన కోరుకుంటున్నారని అన్నారు. రాహుల్ గాంధీ వియత్నాం వెళ్లారని తిరిగి వచ్చాక ఏం జరుగుతుందో చూడమని సంజయ్ రౌత్ వార్నింగ్ ఇస్తున్నారని సంబిత్ పాత్ర అన్నారు. దేశంలోని ప్రభుత్వాన్ని ఎలా మార్చాలో, జార్జ్ సోరోస్ ఆయన టీమ్ నుంచి శిక్షణ తీసుకోవడానికి రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లారని ఆరోపించారు. కానీ ఆయన ప్రయత్నాలకు ప్రజలు మద్దతు ఇవ్వలేని చెప్పారు.
Also Read
- BJP: అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ ‘‘జెన్-జీ’’ కాదు.. తిరంగాతో సానుభూతి యత్నం!
- Gujarat Man Suicide: భార్య, అత్తింటి వేధింపులు.. కొండపై నుంచి దూకి యువకుడి ఆత్మహత్య..
- Marco Rubio: భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోము.. నిరసనలపై మార్కో రూబియో..
- CJP: ‘‘జంతర్ మంతర్ ఎందుకు వెళ్లారు’’.. సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలకు హైకోర్టు ఘాటు ప్రశ్నలు..
విజయ దశమి ర్యాలీలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. దేశ శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారని, దేశాన్ని ద్వేషించే వారు, దేశ రాజ్యాంగ సంస్థలను అపఖ్యాతి పాలు చేసేవారు దేశశత్రువులుగా సంబిత్ పాత్ర పేర్కొన్నారు. దేశాన్ని అస్థిరపరిచేందుకు రాహుల్ గాంధీని రంగంలోకి దించే కుట్ర జరుగుతోందని, రాహుల్ గాంధీ విదేశాల్లో జార్జ్ సోరోస్ కుటుంబ సభ్యులతో సమావేశాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు.
తాజావార్తలు
-
BJP: తిరుగుబాటు కోసమే వియత్నాంకు రాహుల్ గాంధీ.. బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణ.!
-
Killer Movie: ఇంటర్వెల్ ట్విస్ట్ చెబితే ఏకంగా కోటి రూపాయలు: డైరెక్టర్ సంచలన ఛాలెంజ్
-
BJP: అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ ‘‘జెన్-జీ’’ కాదు.. తిరంగాతో సానుభూతి యత్నం!
-
Rag Mayur : ‘గరివిడి లక్ష్మి’తో హాట్ టాపిక్‌గా రాగ్ మయూర్!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..