KCR : విచారణకు నేను రాలేను.. నోటీసులపై స్పందించిన కేసీఆర్..!
- సిట్‌కు రిప్లై ఇచ్చిన కేసీఆర్
- రేపు సిట్ విచారణకు రాలేను
- మున్సిపల్ ఎన్నికలు ఉన్నందున సమయం కోరిన కేసీఆర్
- విచారణ వాయిదా వేయాలని కోరిన కేసీఆర్
- విచారణకు మరింత సమయం కోరిన కేసీఆర్
- ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లోనే విచారించాలని కోరిన కేసీఆర్
- విచారణకు సహకరిస్తానన్న కేసీఆర్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరుకావాలంటూ సిట్ అధికారులు ఇచ్చిన నోటీసులపై కేసీఆర్ స్పందించారు. ప్రస్తుతం రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నందున, పార్టీ కార్యకలాపాల్లో బిజీగా ఉన్నానని, అందుకే రేపటి విచారణకు హాజరుకాలేనని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో విచారణను వాయిదా వేయాలని, తనకు మరింత సమయం కావాలని ఆయన సిట్ అధికారులను కోరారు. విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని కేసీఆర్ తన సమాధానంలో పేర్కొన్నారు. అయితే విచారణను తన నివాసమైన ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లోనే నిర్వహించాలని ఆయన అధికారులను కోరారు.
Also Read
హైదరాబాద్‌లోని పోలీస్ స్టేషన్‌కు రావడం కంటే, ఫామ్‌హౌస్‌లోనే అధికారులు ప్రశ్నలు అడిగితే తాను సమాధానాలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన వెల్లడించారు. కేసీఆర్ ఇచ్చిన రిప్లైపై సిట్ అధికారులు ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. మున్సిపల్ ఎన్నికల కారణాన్ని అధికారులు అంగీకరిస్తారా? లేక రేపే ఎర్రవల్లికి వెళ్లి విచారణ జరుపుతారా? అనేది చూడాలి. ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు వంటి ముఖ్య నేతలు ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో భేటీ అయి ఈ న్యాయపరమైన అంశాలపై చర్చించారు.
Municipal Elections : ఎన్నికల పుణ్యమా అని మున్సిపాలిటీకి కాసుల వర్షం..!
తాజావార్తలు
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
India vs Pakistan: ఏషియన్ గేమ్స్‌లో బిగ్ ఫైట్.. భారత్-పాకిస్థాన్ మధ్య ఫైనల్ పోరు..? కానీ..
-
AP Government: ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్.. EHSపై ప్రభుత్వం కీలక నిర్ణయం
-
DTTTMovie : యంగ్ టైగర్ వస్తున్నాడు.. టికెట్స్ కోసం భారీ డిమాండ్
-
Astrology: సెప్టెంబర్ 29 మంగళవారం దినఫలాలు.. ఈ రాశులవారికి అనుకోని గుడ్‌న్యూస్..
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!