KCR: హైకోర్టులో కేసీఆర్‌కు చుక్కెదురు.. ఆ పిటిషన్ కొట్టివేత
- విద్యుత్ కమిషన్‌పై కేసీఆర్ పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు
- విద్యుత్ కమిషన్ రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించిన కేసీఆర్
- ప్రభుత్వ వాదనలను సమర్థించిన న్యాయస్థానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KCR: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. విద్యుత్ కమిషన్ ఏర్పాటును రద్దు చేయాలని కేసీఆర్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను హైకోర్టు సీజే ధర్మాసనం కొట్టేసింది. విద్యుత్ కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నరసింహారెడ్డి కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ కేసీఆర్ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయన తరఫు న్యాయవాదులతో హైకోర్టు విభేదించింది. నిబంధనల మేరకే కమిషన్ వ్యవహరిస్తోందని, కేసీఆర్ పిటిషన్‌కు విచారణార్హత లేదన్న ప్రభుత్వ వాదనలు హైకోర్టు సమర్థించింది. విద్యుత్ కమిషన్ విచారణను కొనసాగించవచ్చంటూ హైకోర్టు ధర్మాసనం పేర్కొంది.
Read Also: New Criminal Laws: నేటినుంచి అమల్లోకి కొత్త చట్టాలు.. ఢిల్లీలో తొలి ఎఫ్ఐఆర్ నమోదు
Also Read
- Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
- Drug Network Busted : గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. ప్రధాన సూత్రధారి క్రిస్టీ అరెస్ట్
- CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయంటూ ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో కమిషన్ వేసింది. ఈ కమిషన్ మాజీ సీఎం కేసీఆర్‌కు విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు కూడా జారీ చేసింది. ఈ క్రమంలో ఆయన ఆ కమిషన్‌ను రద్దు చేయాలని హైకోర్టులో రిట్ పిటిషన్ వేయగా.. దీని విచారణ అర్హతపై ఇరు వర్గాలు వాదనలు వినిపించగా.. విచారణ అర్హత లేదని ప్రభుత్వ వాదనల న్యాయస్థాన ఏకీభవించింది. విద్యుత్ కొనుగోళ్లలో ఎక్కడా అవకతవకలు జరగలేదని.. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా కమిషన్ ఏర్పాటైందని కేసీఆర్ తరఫు న్యాయవాది ఆదిత్య సోందీ వాదనలు వినిపించారు. పద్దతి ప్రకారమే విచారణ జరగుతోందని, ట్రాన్స్‌కో, జెన్కో అధికారుల్ని కూడా కమిషన్ విచారించిందని.. ప్రభుత్వం తరపున ఏజీ సుదర్శన్‌రెడ్డి న్యాయస్థానంలో వాదనలు వినిపించారు.
తాజావార్తలు
-
Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
-
India’s First General Elections 1952: ఆనాడు ఎన్నికలు ఎలా జరిగాయో తెలుసా.?
-
Elon Musk Vs Ambani Starlink War : అంబానీతో మస్క్.. గొడవేంటి..?
-
Europe Calling: భారతీయుల చూపు యూరప్ వైపు ఎందుకు..?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..