రాష్ట్రంలో ప్రజలను మభ్య పెట్టడంలో సీఎం కేసీఆర్ ను మించిన వారు ప్రప్రంచంలో ఎవరు లేరు అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎస్సీ, ఎస్టీ డెవలప్మెంట్ ఫండ్ గా పేరు మార్చి, నిధులు ఖర్చు చేయకుండ రాబోయే సంవత్సరంలో క్యారీ ఫార్వర్డ్ ను ఆసరాగా చేసుకొని దళితులను దగా చేస్తున్నారు అంటూ ఆయన మండిపడ్డారు. ఎస్సీ, రూ.30, వేల, ఎస్టీ రూ.20 వేల కోట్లు నిధులు ఖర్చు చేయకుండా.. ఖజానాలో మూలుగుతున్నాయి. ప్రభుత్వానికి చిత్త శుద్ది లేక నిధులు ఖర్చు చేయలేదు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : Asaduddin Owaisi: మోడీ కాదు ఆయనే పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాలి.. అలా అయితేనే వస్తాం..
రాష్ట్రంలో దళితులకు మూడు ఎకరాల భూమి పథకం కనుమరుగైంది అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. కళ్యాణ లక్ష్మీ నిధులు కూడా ఎస్సీ నిధుల నుంచి వెచ్చిస్తున్నారు.. రు.30 వేల కోట్లు ఖర్చు చేస్తే రాష్ట్రము లో ఇళ్లు లేని దళితులు ఉండరు. ఇప్పటికైనా దళిత బంధు ఇవ్వడం సంతోషమే.. 2021-2022 ప్రయోగాత్మకంగా నియోజకవర్గానికి 100 దళిత బంధు ఇస్తామన్నారు.. 2022-23 లో దళిత బంధు పథకం కింద నియోజక వర్గంలో 1500 మందికి బడ్జెట్ లో రూ.17700 కోట్లు కేటాయించినా ఒక్కరికీ కూడా ఇవ్వలేదు అని ఆయన గుర్తు చేశారు.
Also Read : Andhra Pradesh Crime: వీడిని ఏమనాలి..? లేగదూడలే టార్గెట్.. రాత్రివేళ లైంగిక దాడి..!
ఉమ్మడి రాష్ట్రంలో అర్హత ప్రాతిపదికన ఇళ్ల నిర్మాణం అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత హౌసింగ్ డిపార్ట్ మెంట్ ఎత్తేశారు.. స్వంత స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుంటే రూ.3 లక్షలు ఇస్తామన్నారు.. ఇంత వరకు దళిత బంధు అమలుకు మార్గదర్శకాలు లేవు.. నవంబర్ లో ఎన్నికలు రావొచ్చు అని సీఎం కేసీఆర్ చెప్పారు.. జూలైలో ఇళ్లు మంజూరు ప్రక్రియనే పూర్తి కాదు.. నిర్మాణాలు ఎలా పూర్తి చేస్తారు అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ మీ చేతిలో లేనప్పుడు ఇస్తామని ఎందుకు చెప్పారు అంటూ కాంగ్రెస్ ఎమ్మె్ల్సీ జీవన్ రెడ్డి అడిగారు.