Kavitha to participate in BRS Party Atmiya Sammelan: నేడు ఎమ్మెల్సీ కవిత జగిత్యాల పర్యటనకు వెళ్లనున్నారు. ఈడీ విచారణ తరువాత తొలిసారిగాని ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పర్యటించనున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొననున్నారు. జిల్లా కేంద్రంలోని గాంధీనగర్ నుండి ర్యాలీగా వచ్చి కొత్త బస్టాండ్ దగ్గర వున్న తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలవేసి అనంతరం 12 గంటలకు జిల్లా కేంద్రంలోని పద్మనాయక కల్యాణమండపంలోని ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొననున్నారు. అనంతరం కవిత ప్రసంగించనున్నారు. కవిత పర్యటన నేపథ్యంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు శ్రేణులు భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు. అయితే కవిత ప్రసంగంపై సర్వత్ర ఉత్కంఠత నెలకొంది. కవిత ఏం మాట్లాడనున్నారు. ఎవరి గురించి నోరువిప్పనున్నారు. ఎవరెవరికి చురకలంటించనున్నారు. ప్రశ్నిస్తారా? తనపై వస్తున్న ఆరోపణలకు సమాధానాలు చెబుతారా? అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Read also: Vikram Reddy : వైసీపీ వీడుతున్నట్లు ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన ఆత్మకూరు ఎమ్మెల్యే
ఇక తాజాగా నిజామాబాద్‌లో పర్యటించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలంగాణను పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చామని అన్నారు. కాగా.. ఇప్పటికే తెలంగాణలో అనేక అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టాయన్న ఆమె త్వదారా వేల మందికి ఉపాధి లభించిందని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా.. దేశ వ్యాప్తంగా ఐటీ ఎక్స్‌పోర్ట్‌లో రాష్ట్రం రెండవ స్థానంలో ఉందని.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రూ. 50 కోట్లతో నిర్మిస్తున్న ఐటీ హబ్‍ను త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు.
IPL 2023 : క్రికెట్ అభిమానులకు డబుల్ మజా