MLC Kavitha : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీఎం రేవంత్ రెడ్డిపై పలు విమర్శలు చేశారు. బోనాల పండుగను పురస్కరించుకొని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న పాలనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “ఇప్పటివరకు 18 నెలల్లో రెండు లక్షల కోట్ల అప్పులు తెచ్చారని సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు. అయినా రాష్ట్రంలో ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా మొదలవ్వలేదు. కేసీఆర్ హయంలో తీసుకున్న అప్పులకు వడ్డీలు కట్టలేక అప్పులు తెస్తున్నామని సీఎం చెబుతుండడం అబద్ధం” అంటూ విమర్శించారు.
Havish : రోజుకొక సినిమా రిలీజ్ చేయాలని ఉంది
తాను ఎప్పుడూ ఆధారాలు లేకుండా మాట్లాడనని స్పష్టం చేసిన కవిత, రేవంత్ రెడ్డికి “అవినీతి చక్రవర్తి” అనే బిరుదు జాగృతి తరఫున ఇస్తున్నామని తెలిపారు. “ఇంకో నెలరోజుల్లో రేవంత్ రెడ్డి అవినీతిపై ఓ పుస్తకం ప్రచురించి ప్రజల్లో పంపిణీ చేస్తాం. కమీషన్లు తీసుకుంటూ కాంట్రాక్టర్ల కడుపు నింపుతున్నారు” అని ఆరోపించారు. జులై 6న చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి భేటీ నేపథ్యంలో బనకచర్ల ప్రాజెక్టుపై నిశ్శబ్దం వీరించిన విషయం కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. “బనకచర్ల ప్రాజెక్టుపై రేవంత్ స్పందించకుండా ఉండిపోవడం వెనుక చంద్రబాబు భయం ఉంది. చంద్రబాబుకు హైదరాబాద్ బిర్యానీ తినిపించారని చెప్పేంత సన్నిహితంగా ఉన్నారు. కేసీఆర్ ఎంతైనా తెలంగాణకు అన్యాయం జరగకుండా చూస్తారు.
కానీ ఇప్పుడు పరిస్థితి భిన్నంగా మారింది” అని కవిత వ్యాఖ్యానించారు. బీజేపీ ఎంపీలు కేంద్రం నుంచి రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా రాకున్నా స్పందించకపోవడం పట్ల ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. “ఈ పరిస్థితుల్లో ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారు. నిజమేమిటో త్వరలోనే తెలియజేస్తారు” అని ఆమె చెప్పుకొచ్చారు.
Online Adult Content: అంబర్‌పేటలో ‘లైవ్ న్యూడ్’ వీడియోల వ్యాపారం.. దంపతుల అరెస్ట్..!