Rangareddy Crime: షాద్ నగర్ లో కిడ్నాప్.. గచ్చిబౌలిలో హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karunakar Reddy, who was kidnapped in Kothur, was brutally murdered: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ లో కిడ్నాప్ కు గురైన కరుణాకర్ రెడ్డి కథ విషాదాంతంగా ముంగిసింది. ఇవాళ ఆయన దారుణ హత్యకు గురయ్యాడు. చేగూర్ సమీపంలో కరుణాకర్ రెడ్డి కారును అడ్డగించి అద్దాలు పగలగొట్టి అతని పై దాడి చేశారు. అడ్డగించిన వ్యక్తి పై దాడి చేసి కరుణాకర్ రెడ్డి కిడ్నాప్ చేశారు. సిక్రేట్ ప్లేస్ కు తీసుకొని వెళ్లిన దుండగులు. కరుణాకర్ ను విచక్షణారహితంగా దుండగులు చితకబాదారు. ముఖంపై పిడు గుద్దులు గుద్ది రెండు చేతులు, కాళ్లు దుండగులు విరగగొట్టారు. దీంతో కరుణాకర్ రెడ్డి అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. కరుణాకర్ రెడ్డి కదలకపోవడంతో దుండగులు నిన్న రాత్రి గచ్చిబౌలి కాంటినెంటల్ ఆసుపత్రికి తీసుకొచ్చారు.
కరుణాకర్ రెడ్డిని పరీక్షించిన వైద్యులు కరుణాకర్ రెడ్డి అప్పటికే మృతి చెందాడని చెప్పడంతో ఆసుపత్రి నుండి దుండగులు పరారయ్యారు. కరుణాకర్ రెడ్డిని తీసుకుని ఐదు మంది ఆసుపత్రికి వచ్చినట్లు సమాచారం. ఆసుప్రతి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటా హుటిన అక్కడకు చేరుకున్నారు. మృతి చెందిన వ్యక్తి కరుణాకర్ రెడ్డిగా గుర్తించారు. కరుణాకర్ రెడ్డి మృతదేహం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈవిషయమై కరుణాకర్ రెడ్డి కుటుంబానికి తెలియజేశారు. దీంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు కరుణాకర్ రెడ్డి స్వస్థలం మల్లాపూర్ గ్రామంలో భారీగా పోలీసుల మోహరించారు.
Also Read
- Scholarships : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
- MeeSeva : మీసేవ సర్టిఫికెట్లలో కొత్త మార్పు.. ఇక లామినేషన్ అవసరం లేదు
- Telangana: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తెలంగాణ వాసి మృతి.. ప్రభుత్వం కీలక నిర్ణయం
- TG SAFE : హైవేపై హోటళ్లలో ఇదేం దారుణం.? పురుగుల మధ్య వంటలు, పలు హోటళ్లు సీజ్
Read also: KTR Twitter: ట్విటర్ లో కేటీఆర్‌ను ప్రశ్నించిన నెటిజన్.. స్మూత్ గా బదులిచ్చిన మంత్రి
కరుణాకర్ రెడ్డి చనిపోయిన వార్త వినగానే కుటుంబంలో విషాధఛాయలు అలుముకున్నాయి. నిన్న కిడ్నాప్ గురయ్యారని ఫిర్యాదు చేసామని ఇవాల కరుణాకర్ రెడ్డి చనిపోయాడని పోలీసులు ఫోన్ చేశారని కన్నీరుమున్నీరయ్యారు. కొత్తూరు ఎంపీపీ మధుసూదన్ రెడ్డి బామ్మర్దులు పాత కక్షలు నేపథ్యంలో కిడ్నాప్ చేసినట్లు కిడ్నాప్ చేసి కరుణాకర్ రెడ్డి ని చంపేసారని తల్లి స్వరూప వాపోయింది. తనకు న్యాయం చేయాలని కరుణాకర్ రెడ్డిని చంపిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.
ఓ భూమి విషయంలో గ్రామ పెద్ద మద్య పంచాయితీ కొనసాగుతుంది. కరుణాకర్ రెడ్డికి అనుకూలంగా తీర్పు రావడంతో MPP మదుసూదన్ రెడ్డి జీర్ణించుకోలేక పోయాడు. పంచాయతి అయిపోయి నప్పటి నుండి 15 మంది తో మదుసూదన్ రెడ్డి మనుషులు రెక్కీ నిర్వహించారు. చివరికి చేగూర్ సమీపంలో అటాక్ చేసి, కారులో కిడ్నాప్ చేశారు. కరుణాకర్ రెడ్డి చచ్చిపోయేంత వరకు కొట్టి ఏమీ తెలియనట్లు ఆసుపత్రికి తీసుకుని వచ్చిన చనిపోయాడని తెలియగానే అక్కడి నుంచి పరార్ అయ్యారు.
తాజావార్తలు
-
Scholarships : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
-
Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
-
Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
-
Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
-
Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!