Karumuri Nageswara Rao : కారుమూరికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్.. చంచల్‌గూడ జైలుకు తరలింపు
- 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్
- లిక్కర్ స్కామ్‌లో ఈడీ దూకుడు
- రూ.15 కోట్ల అక్రమ సొమ్ము ఆరోపణలు
- వైద్య పరీక్షల తర్వాత జైలుకు తరలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karumuri Nageswara Rao : ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. మద్యం రవాణా అక్రమాల వ్యవహారంలో ఆయనను అరెస్ట్ చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు, హైదరాబాద్‌లోని ఈడీ ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరిచారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం కారుమూరికి 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈడీ అధికారులు ఆయనను వైద్య పరీక్షల అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించారు.
అసలు కేసు ఏంటి? సిట్ నమోదు చేసిన ఫిర్యాదులు
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నూతన మద్యం విధానాన్ని అడ్డుపెట్టుకుని భారీ కుంభకోణానికి తెరలేపారనే ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. దర్యాప్తులో భాగంగా సిట్ అధికారులు పలు కీలక అంశాలను గుర్తించారు. మద్యం ధరలను నిబంధనలకు విరుద్ధంగా పెంచడం, భారీగా మామూళ్లు చెల్లించిన కంపెనీలకే విక్రయ అవకాశాలు కల్పించడం, అలాగే ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ డిపోల నుంచి వైన్ షాపులకు మద్యం సరఫరా చేసే రవాణా కాంట్రాక్టులలో కూడా పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగినట్లు నిర్ధారించారు. ఈ అక్రమాలపై సిట్ రెండు కేసులు నమోదు చేయగా, నిధుల మళ్లింపు (మనీ లాండరింగ్) కోణంలో ఈడీ మరో కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేసింది.
Also Read
- CM Revanth Reddy : కొండా సురేఖ ఎపిసోడ్‌పై రేవంత్ క్లారిటీ.. కీలక వ్యాఖ్యలు..
- Telangana High Court : కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌పై స్టే ఎత్తివేత.. కానీ..!
- CM Revanth Reddy : ఇది ఫెడరల్ స్ఫూర్తిపై దెబ్బ.. పార్లమెంట్లో పంచాయితీ ఖాయం
- CM Revanth Reddy : కేంద్రంపై సీఎం రేవంత్ ఫైర్.. నన్ను కాదు.. తెలంగాణ ప్రజలనే తిరస్కరించారు
సోదాలు, నిధుల మళ్లింపు.. లగ్జరీ వస్తువులు స్వాధీనం
ఈ దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు మాజీ మంత్రి కొడుకు కారుమూరి సునీల్‌కుమార్, ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డితో పాటు రాజ్ కెసిరెడ్డి, విజయ నరసింహారెడ్డి, సందీప్‌ల ఇళ్లలో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీలలో మద్యం రవాణాకు సంబంధించిన జాయింట్ వెంచర్ అక్రమ ఒప్పందం కాపీలను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా రెండు ఖరీదైన ‘రోలెక్స్’ వాచీలు, ఒక ‘రేంజ్ రోవర్’ లగ్జరీ కారును ఈడీ సీజ్ చేసింది. దర్యాప్తు క్రమంలోనే ఈ కుంభకోణంలో కారుమూరి నాగేశ్వరరావుకు రూ.15 కోట్ల మేర అక్రమ సొమ్ము ముట్టినట్లు ఈడీ అధికారులు ప్రాథమికంగా లెక్క తేల్చారు.
అరెస్టుల పరంపర.. ఆదివారం నాటకీయ పరిణామాలు
ఈ మనీ లాండరింగ్ కేసులో ఈడీ అధికారులు ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేశారు. జూన్ 11న వాసుదేవరెడ్డి, రాజ్ కెసిరెడ్డిలను అరెస్ట్ చేయగా, జూన్ 18న మాజీ మంత్రి తనయుడు కారుమూరి సునీల్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత జూన్ 23 ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని తన స్నేహితుడి ఇంట్లో తలదాచుకున్న మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఈడీ బృందం నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ చేసింది. సోమవారం ఉదయం ఆయనకు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తయ్యాక ఈడీ కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ ఖరారు చేయడంతో ఆయనను నేరుగా చంచల్‌గూడ జైలుకు తరలించారు.
తాజావార్తలు
-
Karumuri Nageswara Rao : కారుమూరికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్.. చంచల్‌గూడ జైలుకు తరలింపు
-
Jinping: భారీ బృందంతో ఢిల్లీకి వస్తున్న చైనా అధ్యక్షుడు.. బ్రిక్స్‌లో పాల్గొననున్న జిన్‌పింగ్
-
Sai Kumar: రవి నువ్వొక దొంగవి.. సాయికుమార్ కామెంట్స్‌తో నవ్వులే నవ్వులు!
-
FEFSI : కోలీవుడ్‌లో సమ్మె సైరన్‌పై ఫెఫ్సీ ఆందోళన: బంద్ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని విజ్ఞప్తి!
-
Rambha Urvashi Menaka Trailer: నవ్వులు పూయిస్తున్న అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’ ట్రైలర్.. చూశారా!
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!