Sai Kumar: రవి నువ్వొక దొంగవి.. సాయికుమార్ కామెంట్స్‌తో నవ్వులే నవ్వులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sai Kumar: ‘ఇరుముడి’ చిత్ర విజయోత్సవ వేదికపై డైలాగ్ కింగ్ సాయికుమార్ ‘ఇరుముడి’ సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సినిమాలో గురుస్వామి పాత్రలో తనదైన డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్న ఆయన.. ఈ చిత్రంలో భాగం కావడం తన 50 ఏళ్ల సినీ ప్రయాణంలో ఎంతో గర్వంగా భావిస్తున్నానని తెలిపారు. ‘ఇరుముడి’ సక్సెస్ మీట్లో పాల్గొన్న సాయికుమార్ చిత్రబృందానికి, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ‘ఇరుముడి’ కథను దర్శకుడు శివ తనకు వివరించినప్పుడు కథ బాగా నచ్చిందని సాయికుమార్ చెప్పారు. అయితే సినిమాలో తన క్యారెక్టర్, షూటింగ్ లొకేషన్లు, అక్కడి పరిస్థితుల గురించి తెలుసుకున్న తర్వాత కొంత ఆలోచించి ఈ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పినట్లు తెలిపారు. సీలేరు, మోతుగూడెం ప్రాంతాల్లో షూటింగ్ సమయంలో చిత్రబృందానికి అందించిన సౌకర్యాలను ఆయన ప్రశంసించారు. మైత్రి మూవీ మేకర్స్ సహకారాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించిన సాయికుమార్.. షూటింగ్ సమయంలో వైద్య శిబిరంతో మంచి పనిని ప్రారంభించడం సంతోషంగా అనిపించిందన్నారు. సినిమా కోసం ఎంచుకున్న లొకేషన్లను డైరెక్టర్, ఆర్ట్ డైరెక్టర్లు అద్భుతంగా తీర్చిదిద్దారని, సినిమాటోగ్రాఫర్ విష్ణు వాటిని ఎంతో అందంగా తెరకెక్కించారని ప్రశంసించారు. ‘ఇరుముడి’ కారణంగా సీలేరు ప్రాంతం ఇప్పుడు టూరిజం స్పాట్‌గా మారే పరిస్థితి కనిపిస్తోందని అన్నారు.
తన 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో ‘ఇరుముడి’లాంటి సినిమాలో నటించడం ఎంతో గర్వంగా ఉందని సాయికుమార్ పేర్కొన్నారు. ఈ సినిమా సక్సెస్‌కి కారణమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. రవితేజ గురించి మాట్లాడుతూ సాయికుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “రవి మా ఫ్యామిలీ లాంటివాడు. అయితే అతను చాలా దొంగ. రవి పక్కన జాగ్రత్తగా లేకపోతే మనం అయిపోతాం” అంటూ సరదాగా కామెంట్స్ చేశారు. షూటింగ్ సమయంలో రవితేజ చాలా క్యాజువల్‌గా వచ్చేవాడని, కానీ షాట్లోకి వెళ్లిన వెంటనే అద్భుతమైన నటనతో ఆకట్టుకునేవాడని ప్రశంసించారు. సినిమా మొత్తం టీమ్‌వర్క్‌తోనే రూపొందిందని, ప్రతి ఒక్కరి కృషి ఉందని సాయికుమార్ పేర్కొన్నారు. దర్శకుడు శివ, నటీనటులు, సాంకేతిక నిపుణులందరి కృషి వల్లే సినిమా మంచి ఫలితాన్ని అందుకుందని పేర్కొన్నారు. సినిమాకు వస్తున్న స్పందనపై సాయికుమార్ ఆనందం వ్యక్తం చేశారు. మైసూరులోని ఐనాక్స్‌లో ‘ఇరుముడి’ చిత్రాన్ని తాను స్వయంగా వీక్షించానని, దేశంతో పాటు విదేశాల నుంచి కూడా ప్రేక్షకులు సినిమా గురించి ఫోన్లు, మెసేజ్‌లు చేస్తున్నారని తెలిపారు. అమెరికా, దుబాయ్, మెల్బోర్న్, యూకే తదితర ప్రాంతాల నుంచి వస్తున్న స్పందన సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. అమ్మ, నాన్న, గురువు, దైవం అనే విలువలను నమ్మే వ్యక్తిగా ‘ఇరుముడి’ కథ తనకు ఎంతో దగ్గరైందని సాయికుమార్ తెలిపారు. సినిమాలోని భావోద్వేగాలు ప్రేక్షకులను కదిలిస్తున్నాయని, మంచి సినిమా తీస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనే విషయానికి ‘ఇరుముడి’ సక్సెస్ నిదర్శనమని పేర్కొన్నారు.
Also Read
- Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
- Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
- Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
- Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
తాజావార్తలు
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
-
Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!