కిసాన్ మోర్చా నాయకులపై పోలీసుల దౌర్జన్యాన్ని ఖండిస్తున్నా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ అన్నారు. ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తే కార్యకర్తల కాళ్ళు , విరిగేలా దాడి చేస్తరా అని బండి సంజయ్ ప్రశ్నించారు. పోలీసుల దాడిలో కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఒక నాయకుడి కాలు విరిగింది, ఇంకో నాయకుడి మెడ పై తీవ్ర గాయం అయింది అని బండి సంజయ్ తెలిపారు. ఇక గాయపడ్డ కార్యకర్తలను తక్షణమే ఆసుపత్రికి తరలించాలి. వందలాది మంది కార్యకర్తలను అరెస్టు చేశారు. ఆ అరెస్టు చేసిన కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలి అని బండి సంజయ్ డిమాండ్ చేసారు.