NTV Telugu Site icon

Kamareddy Master Plan: కామారెడ్డిలో ఉద్రిక్తత.. షబ్బీర్ అలీ సహా 100 మంది అరెస్ట్

Shabbir Ali

Shabbir Ali

Kamareddy Master Plan: కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను నిరసిస్తూ రైతుల బంద్ కు మద్దతుగా కాంగ్రెస్ ర్యాలీ చేపట్టింది. ఇందిరా చౌక్ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. మాస్టర్ ప్లాన్ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. షబ్బీర్ అలీ, కిసాన్ కేత్ రాష్ట్ర నాయకులు, కాంగ్రెస్ శ్రేణుల ధర్నా ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీ, కిసాన్ కేత్ జాతీయ నేత కోదండ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి సహా 100 మంది కార్యకర్తల అదుపులో తీసుకున్నారు పోలీసులు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. అయితే.. షబ్బీర్ అలీని తరలించే వాహనానికి ముందు కాంగ్రెస్ కార్యకర్తలు బైఠాయించి అడ్డుకున్నారు. పోలీస్ వాహనంలో షబ్బీర్ అలీని పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా..కొత్త మాస్టర్ ప్లాన్ ను వెంటనే వెనక్కి తీసుకోవాని రైతు జేఏసీ ఇవాళ కామారెడ్డి బంద్ కు పిలుపునిచ్చింది. ఈ బంద్ కు కాగ్రెస్ ,బీజేపీలు మద్దతు ప్రకటించాయి. నేడు ఉదయం నుండి రైతు జేఏసీ నేతలు, కాంగ్రెస్, బీజేపీ సహా పలువురిని పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇవాల కామారెడ్డి బంద్ కు జేఏసీ పిలుపు నివ్వడంతో కామారెడ్డికి వచ్చే రూట్లన్నీ బంద్ చేసి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Read also: Sangareddy Crime: సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్రిక్తత.. DSP రవీంద్రా రెడ్డి తో వాగ్వాదం

నిన్న రైతుల ఆందోళనను జిల్లా కలెక్టర్ అవమానపరిచారని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ మండిపడ్డారు. మాస్టర్ ప్లాన్ బాధిత రైతులకు కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ సవరిస్తామని రైతులకు స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీరు దున్నపోతు పై వర్షం పడ్డట్లు ఉందని విమర్శించారు. మాస్టర్ ప్లాన్ పేరుతో ప్రభుత్వం భూములు లాక్కునే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ప్రభుత్వ భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని ప్రభుత్వం చూస్తోందన్నారు. కామారెడ్డి లో రైతుల భూముల్లో ఇండస్ట్రియల్ ప్రతిపాదన రద్దు చేయాలని, మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నట్లు మంత్రి కేటిఆర్ ప్రకటన చేసే వరకు ఉద్యమం ఆగదన్నారు మాజీ మంత్రి షబ్బీర్ అలీ. ఇక కామారెడ్డి బంద్ కు మద్దతుగా అడ్లూరు ఎల్లారెడ్డి రైతుల ప్రదర్శన నిర్వహించారు. కామారెడ్డి కొత్త బస్టాండ్ ప్రాంతంలో రైతలను అదుపులో తీసుకున్న పోలీసులు. దీంతో అక్కడ ఉత్రిక్త వాతావరణం నెలకొంది.