నిర్మల్ జిల్లా కడెం ఫారెస్ట్ కార్యాలయం సీల్ తొలగించారు పంచాయతీ అధికారులు. ఉన్నతాధికారుల ఆదేశాల తో తొలగించామని పంచాయతీ అధికారులు అన్నారు .పన్ను కట్టలేదని మూడు రోజుల క్రితం ఎఫ్ ఆర్ ఓ ఆఫీస్ సీజ్ చేసారు. ఫారెస్ట్ అధికారులు కార్యాలయ ఆవరణలో టెంటు వేసుకొని విధులు నిర్వహించారు. ఈ క్రమంలో వివాదం రోజురోజుకు ముదిరింది. పంచాయతి అధికారులు కక్షపూరితంగా కార్యాలయాన్ని సీజ్ చేశారని ఆరోపించారు ఫారెస్ట్ అధికారులు.
read also: Big Breaking: దుండగుల కాల్పుల్లో జపాన్ మాజీ ప్రధాని షింజో అబే దుర్మరణం
అయినప్పటికీ పంచాయతీ అధికారులు ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు .పన్ను చెల్లించే వరకు సీల్ తొలగించమని తేల్చి చెప్పారు. బుట్టా పూర్ లో క్రీడాస్థలం టైగర్ జోన్ లో ఏర్పాటు చేశారని పంచాయతీ సెక్రెటరీ ఎంపీ ఓ, ఎంపీడీవో పై కేసు నమోదు చేశారు. కేసు నమోదైన కొద్ది గంటల్లోనే రాత్రి ఫారెస్ట్ కార్యాలయం సీల్ ను పంచాయతీ అధికారి తొలగించారు. వర్షం పడుతున్న సమయం లో సిల్ తొలగించి వెళ్లిపోయారు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సీల్ తొలగించినట్లు చెప్పారు.
Flood Warning: గోదావరికి వరద భయం.. ముంపులో లంక గ్రామాలు