Gadwala Politics: పార్టీలోకి బండ్ల కృష్ణను చేర్చుకోవద్దు.. సీఎంను కలిసిన సరిత..
- హాట్ హాట్ గా మారిన గద్వాల రాజకీయం..
- ఎమ్మెల్యేను పార్టీలోకి చేర్చుకోవద్దంటూ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సరిత..
- సీయం నిర్ణయం పై పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gadwala Politics: జోగులాంబ గద్వాల జిల్లాలో హాట్ హాట్ గా గద్వాల రాజకీయం మారుతుంది. రోజు రోజుకు పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ పెరుగుతుంది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి కాంగ్రెస్ లోకి వస్తారన్న వార్త కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతుంది. రేపో మాపో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారనే వార్తతో సరిత వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి హస్తం గూటికి రావడాన్ని సరిత వర్గం వ్యతిరేఖిస్తుంది. ఎమ్మెల్యే ను పార్టీలోకి చేర్చుకోవద్దు అంటూ కార్యకర్తల నిరసనలు వెల్లువెత్తాయి. ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకోవద్దంటూ.. గద్వాల కాంగ్రెస్ శ్రేణులు ఇవాళ భారీగా గాందీభవన్ కు తరలివెళ్లారు. అక్కడ సీఎం రేవంత్ రెడ్డిని గద్వాల్ కాంగ్రెస్ ఇంచార్జ్ సరిత కలిసారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డిని చేర్చుకోవద్దంటూ తెలిపినట్లు సమాచారం. మరి దీనిపై చర్చించిన సీఎం రేవంత రెడ్డి ఏ నిర్ణయం తీసుకోనున్నారనేదానిపై పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠత నెలకుంది. నిన్న (గురువారం) ఏకంగా ఓ కార్యకర్త సెల్ టవర్ ఎక్కి ఆందోళనకు దిగిన తీరు గద్వాలలో సంచలనంగా మారింది. దీంతో అక్కడ ఉద్రిక్త ప్రరిస్థితి నెలకుంది.
Read also: Chittoor: చిత్తూరులో వైసీపీకి భారీ షాక్
Also Read
- Road Accident: అదుపుతప్పి బోల్తాపడ్డ బస్సు.. 20 మందికి గాయాలు!
- OTR: తెలంగాణలో పాగా వేయడానికి ఇదో అవకాశం.. జనసేనాని ఎంట్రీతో లాభం ఎవరికి? నష్టం ఎవరికి?
- Tragic Accident: విషాదం.. ట్రాక్టర్ రివర్స్ తీసుకుంటుంగా ప్రమాదం.. నాలుగేళ్ల చిన్నారి...
- Son Kills Father: మనిషి కాదు.. నరరూప రాక్షసుడు! కన్నతండ్రినే కిరాతకంగా..!
బండ్ల కృష్ణ మోహన్ రెడ్డికి సరితతో విభేదాలు
స్థానిక ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, గద్వాల జెడ్పీ చైర్‌పర్సన్ సరితా తిరుపతయ్య మధ్య గత కొంతకాలంగా రాజకీయ విభేదాలు ఉన్నాయి. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. రెండూ వేర్వేరు పార్టీలే అయినప్పటికీ గద్వాల నియోజకవర్గంపై ఇరువురి మధ్య రాజకీయ పోరు నడుస్తోంది. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ సరిత మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. అధికారులు ఎవరికి వారుగా వ్యవహరించి ఇబ్బందులకు గురిచేస్తున్నారనే చర్చ సాగుతోంది. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో ప్రొటోకాల్ వివాదాలు రాజుకుంటున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో జెడ్పీ చైర్‌పర్సన్ సరిత సొంత క్యాడర్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యే రాకను సరితా తిరుపతయ్య తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
Rahul Gandhi : హత్రాస్ ప్రమాదానికి ఎవరు బాధ్యులు.. రాహుల్ భోలే బాబా గురించి ఏం చెప్పారంటే ?
తాజావార్తలు
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Electricity Meter Red Light Blinking: కరెంట్ బిల్లు భారీగా వస్తుందా? మీటర్ ముందే ఇచ్చే సంకేతం ఇదే.. కచ్చితంగా తెలుసుకోండి..
-
Bhuvneshwar Kumar Comeback: అగార్కర్ హయాంలో భువనేశ్వర్‌కు ఎందుకు చోటు దక్కలేదు?
-
RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
-
Dhanush Political Entry : తమిళనాడు రాజకీయాల్లోకి ధనుష్.. పార్టీ పేరు ఇదే?
ట్రెండింగ్
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!