Rahul Gandhi : హత్రాస్ ప్రమాదానికి ఎవరు బాధ్యులు.. రాహుల్ భోలే బాబా గురించి ఏం చెప్పారంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi : కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శుక్రవారం అలీఘర్, హత్రాస్‌లో పర్యటించారు. ఇక్కడికి చేరుకున్న ఆయన హత్రాస్ ప్రమాద మృతుల కుటుంబాలను పరామర్శించారు. హత్రాస్‌లో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా హత్రాస్ ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. హత్రాస్ ప్రమాదం చాలా బాధాకరమని రాహుల్ అన్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అన్నారు. బాధిత కుటుంబాలకు నష్ట పరిహారం అందజేయాలన్నారు. ఈ ప్రమాదం వల్ల చాలా కుటుంబాలు నష్టపోయాయని రాహుల్ అన్నారు. చాలా మంది చనిపోయారు. దీనిపై ఎలాంటి రాజకీయాలు చేయకూడదనుకుంటున్నాను కానీ పరిపాలన లోపించి తప్పులు దొర్లాయని నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు.
Read Also:Milk Price In Pakistan: పాక్లో దడ పుట్టిస్తున్న పాల ధర.. ప్రజలు ఏం చేశారంటే..?
Also Read
- Petrol and Diesel Price Hike: పాక్లో మళ్లీ పెరిగిన పెట్రో ధరలు.. లీటర్ రూ.409
- CM Revanth Reddy: తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ
- Group 1 Notification 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల..
- GVMC వార్డుల పునర్విభజనకు ఆమోదం.. 120 వార్డులతో తుది గెజిట్ విడుదల
#WATCH | Hathras, Uttar Pradesh: After meeting the bereaved families of the Hathras Stampede accident, Congress leader and Lok Sabha MP Rahul Gandhi says, "A lot of families have been affected and many people have died… I dont want to politicise this. There have been… pic.twitter.com/dohI2TpGVY
— ANI (@ANI) July 5, 2024
సాధ్యమైనంత త్వరగా నష్టపరిహారం బాధిత కుటుంబాలకు అందజేయాలని యూపీ సీఎంను అభ్యర్థిస్తున్నట్లు రాహుల్ తెలిపారు. కుటుంబ సభ్యులతో వ్యక్తిగతంగా రాహుల్ మాట్లాడారు. బాధితులు ఎవరు, ఏంటి, వారు ఏం చేసేవారు, ఎలా జీవించారు ఇలా ప్రతీది చర్చించారు. పరిపాలన లోపం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఉండాల్సిన పోలీసు వ్యవస్థ అక్కడ లేదన్నారు. ఆ ప్రజలు తీవ్ర బాధలో ఉన్నారు. ఈ పరిస్థితిలో వారి బాధలను అర్థం చేసుకోవడానికి తాను ప్రయత్నించానన్నారు. అలీఘర్‌లోని పిల్‌ఖానా గ్రామంలో హత్రాస్ ప్రమాద బాధితుడు ఛోటే లాల్ కుటుంబాన్ని రాహుల్ గాంధీ కలిశారు. తొక్కిసలాటలో చోటాలాల్ భార్య, కొడుకు చనిపోయారు. హత్రాస్‌లోని గ్రీన్ పార్క్‌లోని విభవ్ నగర్‌లో బాధిత కుటుంబాలను రాహుల్ గాంధీ కలిశారు. ఆశాదేవి, మున్నీదేవి, ఓంవతి కుటుంబాలను రాహుల్ కలిశారు. వారిని ఓదార్చారు. తొక్కిసలాటలో మూడు కుటుంబాలకు చెందిన నలుగురు చనిపోయారు.
Read Also:Keir Starmer: యూకే ఎన్నికల్లో లేబర్ పార్టీ విక్టరీ.. తదుపరి ప్రధానిగా కీర్ స్టామర్
Uttar Pradesh: Congress MP and Lok Sabha LoP Rahul Gandhi met the victims of the Hathras stampede, in Aligarh. pic.twitter.com/8h2vh8aijO
— ANI (@ANI) July 5, 2024
తాజావార్తలు
-
Sydney Sweeney: స్పోర్ట్స్ యాడ్‌పై తీవ్ర విమర్శలు.. అథ్లెట్ల ఫొటోలు షేర్ చేసి సిడ్నీ స్వీనీ ఇచ్చిన కౌంటర్ వైరల్!
-
Petrol and Diesel Price Hike: పాక్లో మళ్లీ పెరిగిన పెట్రో ధరలు.. లీటర్ రూ.409
-
Nandigram Bypoll 2026: నందిగ్రామ్ ఉపఎన్నికలో బీజేపీ సంచలన నిర్ణయం.. శుభేందు అధికారి దివంగత పీఏ తల్లికి టికెట్
-
CM Revanth Reddy: తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Mukesh Kumar: టీమిండియా పేసర్‌కు బంపర్ ఆఫర్.. ఇదే మొదటిసారి!
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్‌ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!