జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నేడు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రానికి కేటీఆర్ చేరుకుంటారు. రూ.275.95 కోట్ల నిధులతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు మంత్రి.
మావోయిస్టు వారోత్సవాల నేపద్యంలో తెలంగాణ రాష్ట్రం అలర్ట్ అయ్యింది. జిల్లాల వారీగా టార్టెట్ చేస్తూ తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు పోలీసులు. నేటి నుండి ఈ నెల 8వరకు జరగనున్న మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాలపై పోలీసులు హై అలెర్ట్ అయ్యారు.
ఉపాధి కూలీలు రోడ్డెక్కారు. పనులు బహిష్కరించి ధర్నా చేపట్టారు. ఎంత కష్టపడిన రోజుకూలీకి మాత్రం సరైన ధర ఇవ్వడంలేంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఆరుగాళం కష్టపడిన పై యజమానులిచ్చే కూలీ సరిపోవడంలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రోజంతా కష్టపడితే వారికి వచ్చే రూ.30 మాత్రమేనా అంటూ ప్రశ్నించారు. కనీస ధర కూడా ఇవ్వకుండా మా శ్రమను యజమాను దోచుకుంటున్నారని మండి పడ్డారు. ఈఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. భూపాలపల్లి జిల్లా లోని గణపురం మండల కేంద్రంలోని…
తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. ఉన్నత విద్య అభ్యసించడం కోసం ఇద్దరు అక్కాచెల్లెళ్లకు ఆర్థిక సహాయం చేస్తానని గత నెల 23న మంత్రి కేటీఆర్ ప్రకటించగా తాజాగా సాయం అందించారు. వివరాల్లోకి వెళ్తే… జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన రాజమల్లు ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా పనిచేశాడు. కోవిడ్ సమయంలో ఆయన ఉపాధి పోయింది. దీంతో కూలీ పనులు చేస్తూ తన పిల్లలను చదివిస్తున్నాడు. ఆయన ఇద్దరు కుమార్తెలు కావేరి (21),…
భూపాలపల్లి జిల్లా సర్వాయి పేటలో దారుణం చోటు చేసుకుంది. ఒంటి పై నగల కోసం నీచానికి ఒడిగట్టారు. 75 ఏళ్ల వృద్దురాలని కూడా చూడకుండా పాశవికంగా హత్య చేసిన ఘటన సర్వాయి పల్లిలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం … లంగారి లక్ష్మీ(75) మంగళవారం సాయంత్రం ఎనిమిది గంటల సమయంలో సీరియల్ చూడటానికి పెద్ద కొడుకు ఇంటికి వెళ్లింది. సీరియల్ చూసి న అనంతరం తిరిగి ఇంటికి బయలు దేరింది. బుధవారం తెల్లవారిన ఎంత…
దేశంలో బొగ్గునిల్వల సమస్య ఏర్పడింది. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో బొగ్గు నిల్వలు తగ్గిపోవడంతో విద్యుత్ సరఫరాలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని, అదే జరిగితే విద్యుత్ సంక్షోభం ఏర్పడవచ్చని రాష్ట్రాలు ఆందోళన చెందుతున్నాయి. దీనిపై నిన్నటి రోజుక కేంద్రం ప్రధాని నేతృత్వంలో సమీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. అనంతరం దేశంలోని బొగ్గు నిల్వలపై కేంద్రం దృష్టి సారించింది. ఇందులో భాగంగానే తెలంగాణలో బొగ్గు నిల్వలపై కేంద్రం దృష్టి పెట్టింది. దేశంలో మొత్తం 116 విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు…