Jaya Jaya Telangana: రాష్ట్ర గీతంగా జయజయహే తెలంగాణ… పాట రాసింది ఎవరంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jaya Jaya Telangana: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ సమావేశంలో ‘జయ జయహే తెలంగాణ’ పాటను తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించిన విషయం తెలిసిందే.. ఈ పాటను ప్రముఖ కవి అందెశ్రీ రాశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడక ముందే ఈ పాట రాశారు.
జయ జయహే తెలంగాణ… జననీ జయకేతనం
ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం
Also Read
- Shabad Six-Murder Case: షాబాద్ ఆరుగురి హత్య కేసు.. రాజ్‌కుమార్‌పై భార్య కుటుంబం సంచలన ఆరోపణలు!
- Ram Mohan Naidu: తెలంగాణకు మరో రెండు ఎయిర్‌పోర్టులు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన
- Vijayashanthi: రక్షించాల్సిన వారే తప్పు చేస్తే ఎలా?.. షాబాద్ నరమేధంపై గళమెత్తిన ‘రాములమ్మ’
- Shabad Murder Case: షాబాద్ విషాదం.. ఒంటరిగా మిగిలిన మేఘనకు ప్రభుత్వం ఆర్థిక సాయం
తరతరాల చరితగల తల్లీ నీరాజనం
పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం
జై తెలంగాణ! జై జై తెలంగాణ!! జై తెలంగాణ! జైజై తెలంగాణ!!
Read also: Ponguleti Srinivas Reddy: టీఎస్ కాదు టీజీ.. పేరు మార్పుపై పొంగులేటి క్లారిటీ..!
‘నాది కవిగానం కాదు, కాలజ్ఞానం’ అంటాడు అందెశ్రీ ఆయన చదువుకోలేదు. అందెశ్రీ జనగామ జిల్లా రేవర్తికి చెందిన నిరుపేద కుటుంబంలో జన్మించారు. ఆయన పశువుల కాపరి. తాపీ మేస్త్రీగా పనిచేశారు. 21 ఏళ్లుగా అదే ఆయనకు ఉద్యోగం. అయితే.. కవిత్వం ఆయనకు సహజంగానే వచ్చింది. రాయడం నేర్చుకున్నాడు.. విద్యావంతుడయ్యాడు. డిగ్రీ లేదు కానీ అనేక విశ్వవిద్యాలయాల నుండి డాక్టరేట్లు పొందారు. నదులపై కవిత్వం రాస్తూ ప్రపంచమంతా తిరిగాడు. మిస్సిస్సిప్పి, మిస్సోరీ, అమెజాన్, నైల్ లాంటి మహానదుల వెంట ప్రయాణిస్తూ… నదులపై పెద్ద కవిత రాసే పనిలో పడ్డాడు. ‘నిప్పుల వాగు’ పేరుతో వెయ్యేళ్ల నాటి తెలంగాణ పాటను తాజాగా రికార్డు చేశారు. జయజయహే తెలంగాణ.. పాట ఎలా రాశారో చెబుతూ.. తెలంగాణ సాధన సందర్భంగా 2003 మార్చి 2న కామారెడ్డిలో జరిగిన తెలంగాణ ధూంధాం కార్యక్రమంలో.. మనకంటూ ఓ పాట ఉండకూడదని అనిపించిందట.. అంతే.. ఆ సమయంలో ఈ పాట అతడిని తాకింది.
Read also: UP Road Accident: వర్షంలో వేగంగా వెళ్లిన కారు.. గొయ్యిలో పడి ఆరుగురు మృతి
ఆ ఆలోచన వచ్చిన కొద్దిసేపటికే నాలుగు చరణాలు రాశాడు. మొదటి నాలుగు చరణాలు. తర్వాత 2003 నవంబరు 11న ఆదిలాబాద్‌లో జరిగిన తెలంగాణ రచయితల వేదిక జెండా వందనంలో వీటిని ఆలపించారు. విన్నవారంతా ఏదో తెలియని మైమరుపు.. అందుకే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పాట పాడుతూనే ఉన్నారు. రాస్తూనే ఉన్నాడు. మొత్తం 12 చరణాలు. నిజానికి ఈ పాట తెలంగాణ ప్రకటన తర్వాత 9 డిసెంబర్ 2009 తర్వాత కోట్లాది మందికి చేరింది. కానీ, అంతకుముందే ప్రధాన సమావేశాల్లోని కవులు, కళాకారులు, మేధావులు, ఉద్యమకారులకు ఈపాట నోట చేరింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఈ పాటను రాష్ట్ర గీతంగా ప్రకటిస్తామని తెలిపారు. కానీ ఎందుకో జరగలేదు.. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈపాటను తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించింది. దాంతో ఇప్పుడు వాస్తవం కాబోతోంది.
UP Road Accident: వర్షంలో వేగంగా వెళ్లిన కారు.. గొయ్యిలో పడి ఆరుగురు మృతి
తాజావార్తలు
-
Jr NTR : NTRపై పెద్ద కుట్ర..ఆ సంస్థపై పోలీసులకు ఫిర్యాదు!
-
Jasprit Bumrah: రీఎంట్రీ మ్యాచ్‌లో రికార్డుల వర్షం.. చరిత్ర సృష్టించిన బుమ్రా..
-
Rana Daggubati: రిషబ్ శెట్టి vs రానా.. ‘జై హనుమాన్’లో అసలేం జరుగుతుంది?
-
Modi-Bear Grylls: మోడీ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన నాయకుడు.. బేర్ గ్రిల్స్ ప్రశంసలు
-
CM Vijay: సీఎం అయ్యాక పేరు మార్చుకున్న విజయ్?
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!