T. Rajaiah: స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టేషన్ ఘనపూర్ లో నిర్బంధాల మధ్య రేవంత్ రెడ్డి బహిరంగ సభ కొనసాగిందన్నారు. తూ..తూ.. మంత్రంగా సభ పెట్టి తుస్సుమని వెళ్లిపోయిన రేవంత్.. ఇక, అవినీతి రారాజు కడియం శ్రీహరి కరెప్షన్ గురించి మాట్లాడడం.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. కడియం శ్రీహరి తన ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇక, అవినీతి గురించి మాట్లాడే హక్కు కడియంకు లేదు.. నేను ఎగురుతా, దుకుతా, పాడుతా నీకేంటి అని ప్రశ్నించారు. గత 15 ఏళ్లలో అభివృద్ధి జరుగలేదనడం హాస్యాస్పదం.. కళ్ళు లేని కబోది కడియం… అది నోరా మున్సిపాలిటీ మొరా అని తాటికొండ రాజయ్య పేర్కొన్నారు.
Read Also: Khakee The Bengal Chupur : బెంగాల్ టైగర్ ‘ఖాకీ’గా సౌరభ్ గంగూలీ
ఇక, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా, రెండుసార్లు ఎమ్మెల్సీగా, విద్యాశాఖ మంత్రిగా ఎమ్మెల్యేగా ఉండి.. ఆఖరికి బిడ్డ కోసం ఎంపీ టికెట్ కు అమ్ముడిపోయాడని తాటికొండ రాజయ్య పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాలనలో లక్ష 40 వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చి సస్యశ్యామలం చేస్తే.. 15 నెలల నీ పాలనలో స్టేషన్ ఘనపూర్ ఎడారిగా మారింది అని విమర్శలు గుప్పించారు. అభివృద్ధి కోసమే కాంగ్రెస్ లోకి పోతే… రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలన్నారు. ఇక నుండి కావురమెక్కి మాట్లాడితే నాలుక చీరేస్తానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశంలో అట్టర్ ప్లాప్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తిట్ల పురాణానికి జాతిపిత రేవంత్.. ప్రాణాలు పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి కేసీఆర్.. కౌరవ కాంగ్రెస్ పాలనను ఎప్పటికప్పుడు నిలదీస్తూ రాబోయే రోజుల్లో హస్తం పార్టీని ఓడగొట్టడానికి కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణ, అర్జునులు కేటీఆర్, హరీష్ రావులు కాంగ్రెస్ పై పోరాటం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మండిపడ్డారు.