Kadiyam Srihari: కేటీఆర్ రేపో, మాపో జైలుకు పోవడం ఖాయం.. కడియం ఆసక్తికర వ్యాఖ్యలు
- ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు
- కవిత ఇప్పటికే జైలుకు వెళ్లింది.. కేటీఆర్ రేపో మాపో అరెస్టు అవుతారు- కడియం
- హరీష్ రావు, కేసీఆర్ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కవిత ఇప్పటికే జైలుకు వెళ్లింది.. కేటీఆర్ కూడా రేపో మాపో అరెస్టు అవుతారని అన్నారు. హరీష్ రావు, కేసీఆర్ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. చిల్పూర్ మండలం మల్కాపూర్ లో గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే.. కల్వకుంట్ల కుటుంబం, మాజీ ఎమ్మెల్యే రాజయ్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కల్వకుంట్ల కుటుంబం పది సంవత్సరాల పాలనలో కొత్త రకమైన అవినీతికి తెరలేపిందని ఆరోపించారు. సాక్షాత్తు కేసీఆర్ బిడ్డ.. లిక్కర్ కుంభకోణంలో ఎన్ని రోజులు తీహార్ జైల్లో ఉందో అందరికీ తెలిసిందేనని తెలిపారు.
Read Also: Game Changer: పూర్ గూజ్ బంప్స్.. గేమ్ చేంజర్ ట్రైలర్ అదిరింది బాసూ!
Also Read
రేపో, మాపో ఫార్ములా ఈ- రేసులో కేటీఆర్ జైలుకు పోవడం ఖాయమని కడియం శ్రీహరి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ పూర్తి కాగానే.. కేసీఆర్‌తో పాటు హరీష్ రావు కూడా జైలుకి వెళ్లాల్సిందేనని జోస్యం చెప్పారు. కల్వకుంట్ల కుటుంబం వివిధ కేసుల్లో ఇరుక్కుని.. కొందరు జైలు ఊచలు లెక్కపెట్టి వస్తే, మరికొందరు జైలు ఊచలు లెక్క పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కల్వకుంట్ల కుటుంబానికి 2014కు ముందు ఉన్న ఆస్తులు.. ఇప్పుడు ఉన్న ఆస్తులు ఎంతో ప్రకటించాలని అన్నారు. దళిత బందులో కమిషన్ తీసుకున్నవారు.. నీతులు మాట్లాడడం హాస్యాస్పదం అని తెలిపారు. నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారు నీతులు మాట్లాడడం విడ్డూరం అని దుయ్యబట్టారు. కడియం శ్రీహరి తప్పు చేస్తే ఆధారాలు చూపించండి.. ఇకనైనా సాక్ష్యాలు లేకుండా ఆరోపణలు చేయడం మానుకోవాలని అన్నారు.
Read Also: Bengaluru: ఎయిర్‌పోర్టులో పగిలిన పైపు లైన్.. జలమయమైన కార్యాలయాలు
తాజావార్తలు
-
Vijayawada Durga Temple: దుర్గమ్మ భక్తులకు గుడ్‌న్యూస్.. ఇక ఓటీపీ ఎంటర్ చేస్తే చేతికి దుర్గమ్మ లడ్డూ
-
Himanshi Khurana Murder: కెనడాలో భారత సంతతికి చెందిన యువతి హ*త్య కేసులో కీలక పరిణామం.. 7 నెలల తర్వాత నిందితుడి అరెస్ట్
-
Adnan Sami: ఆరు నెలలే బ్రతుకుతానన్నారు.. తండ్రికిచ్చిన మాటకోసం 110 కిలోలు తగ్గినా: అద్నాన్ సమి
-
TVS Apache RTR 160 Price Hike: టీవీఎస్ Apache RTR 160 ధర పెంపు.. 2V, 4V కొత్త ధరలు, పూర్తి వివరాలు ఇవే!
-
World Tribal Day 2026: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం.. గిరిజనులకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!