NTV Telugu Site icon

DK Aruna: సీఎం రేవంత్ రెడ్డి ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నాడని అనుకుంటున్నారు..

Dk Aruna Vs Revanth Reddy

Dk Aruna Vs Revanth Reddy

జనగామ జిల్లా కేంద్రంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ పర్యటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ ఆంధ్రా వాళ్ళను తిట్టి సీఎం అయితే.. రేవంత్ రెడ్డి కేసీఆర్‌ని తిట్టి సీఎం అయ్యారని వ్యాఖ్యానించారు. కానీ తిట్లు తిట్టి ముఖ్యమంత్రులైన వారిని ప్రజలెవరు హర్షించడం లేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నాడని అనుకుంటున్నారని డీకే అరుణ విమర్శలు గుప్పించారు. పత్రికల్లో కేవలం బ్యానర్ ఐటమ్ కోసమే రాష్ట్ర ప్రభుత్వం తాపత్రయ పడుతుంది తప్ప.. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో చిత్తశుద్ధి లేదని తెలిపారు. రేవంత్ రెడ్డి పత్రికల్లో వచ్చిన బ్యానర్ ఐటమ్ వార్తలను లేవనెత్తి ప్రజలను డైవర్షన్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: Chhaava : థియేటర్లో ప్రత్యక్షమైన శంభాజీ మహారాజ్?

కులగణనలో పాల్గొనని వారిని తెలంగాణ నుండి బహిష్కరిస్తామని అనడానికి రేవంత్ రెడ్డి ఎవరు.. ఆయనకు హక్కు ఏంటి..? అని డీకే అరుణ ఫైరయ్యారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే రేవంత్ రెడ్డినే తెలంగాణ నుండి ప్రజలు బహిష్కరిస్తారని అన్నారు. కులగణన సర్వేలో వ్యక్తిగత వివరాలు, ఆస్తులతో పాటు ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వారు అన్న వివరాలు ఎందుకు సేకరిస్తున్నారని ప్రశ్నించారు. మరోవైపు.. రాష్ట్రంలో పత్తి కొనుగోళ్ళలో అక్రమాలు, అవినీతి జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని అడిగారు. కేసీఆర్ చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో ప్రజలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి భయంతో సర్వేలో పాల్గొన్నారు.. ప్రభుత్వంలో ఉన్న రేవంత్ రెడ్డి కేసీఆర్ చేసిన సర్వేను ఎందుకు బయట పెట్టడం లేదని అన్నారు. మరోవైపు.. రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవిపై స్పందిస్తూ.. పార్టీ హై కమాండ్ ప్రొసీజర్ ప్రకారం బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవరికి ఇచ్చిన కలిసి పని చేస్తామని డీకే అరుణ చెప్పారు.

Read Also: UPSC CSE 2025: సివిల్స్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. దరఖాస్తుల గడువు మరోసారి పొడిగించిన యూపీఎస్సీ