Cruelty of Son: మానవత్వం నశిస్తుంది. కన్నబిడ్డలే తల్లిదండ్రులకు నరకయాతనకు గురిచేస్తున్నారు. వ్యసనాలకు పాల్పడుతూ తల్లిదండ్రులను కడతేర్చేందుకు కూడా వెనుకాడటం లేదు. వ్యసనాలకు బానిసై పైసలకోసం పైసాచికంగా వ్యవహరిస్తున్నారు. కష్టపడి సంపాదించలేని పరిస్థితి, తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులపై వ్యామోహంతో కన్నతల్లినే కడతేర్చాడు కన్నకొడుకు. నవమాసాలు మోసి ప్రయోజకున్ని చేసిన తల్లినే కత్తితో అతి కిరాతకంగా నరికాడు. దీంతో ఈఘన జనగామ జిల్లాలో తీవ్ర కలకలం రేపుతుంది.
Read also:Fire Accident: సికింద్రాబాద్ రైల్ నిలయం వద్ద అగ్నిప్రమాదం.. మంటలు చెలరేగడంతో..
జనగామ జిల్లాలో కురాకులా రాజయ్యకు గ్రామంలో 10 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది, రాజయ్య చనిపోయి 10 సంలు అవుతుంది. ఆ తరువాత ఈభూమిని భార్య రమణమ్మ పేరుమీద చేసుకుంటుంది. రమణమ్మ కు ఒక కొడుకు కురాకులా కన్నప్ప, ఒక కూతురు లావణ్య వున్నారు. కూతురు లావణ్య ,ఓర్సు సాయి అనే వడ్డరి కులస్తుడిని ప్రేమ వివాహం చేసుకుని వెళ్లిపోయింది. దీంతో రమణమ్మ కొడుకు కన్నప్పకు తెలియకుండా కూతురు లావణ్యకు 4 ఎకరాల భూమి పట్టా చేసి ఇచ్చింది. ఇది తెలిసి కన్నప్ప తరుచూ తల్లి రమణమ్మతో గొడవ పడేవాడు. తనకు కూడా భూమి ఇవ్వాలని రోజూ తల్లి రమణమ్మను వేధించేవాడు. ఈ విషయంలో ఈనెల 5న కన్నప్ప తల్లీ రమణమ్మను గోడకేసి కొట్టగా తలకు గాయాలు అయమైంది. దీంతో రమణమ్మ జనగామ పోలీసుకు ఫిర్యాదు చేసింది. పెద్దమనుషులతో మాట్లాడించడంతో కొడుకు కన్నప్ప ఆత్మహత్య ప్రయత్నం చేసి హాస్పిటల్ లో చేరాడు. తనకు నయమై నిన్న రాత్రి (8)న హాస్పిటల్ నుండి డిచార్జ్ అయి వచ్చాడు. అదేరోజు రాత్రి తల్లి రమణమ్మ తో గొడవ పడ్డాడు. స్థలం విషయంలో గొడవ పడ్డాడు. దీంతో రమణమ్మ స్థలం ఇవ్వడానికి నిరాకరించడంతో కోపోద్రోక్తుడైన కన్నప్ప ఇంట్లో ఉన్న కత్తితో గొంతు కోసాడు. అంతేకాకుండా తల్లి తల మొండెం వేరు చేసి కిరాతకంగా హత్య చేశాడు. స్థానిక సమాచారంతోసంఘటన స్థలానికి పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితున్ని అదుపులో తీసుకున్నట్లు సమచారం.
Telangana Assembly: శాసనసభలో బడ్జెట్ పద్దులపై చర్చ.. నేటి నుంచి 3 రోజుల పాటు