Jagtial: జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పాసిగామ ప్రాథమిక పాఠశాలలో ఐదు తరగతుల్లో 33 మంది విద్యార్థులు ఉన్నారు. గతంలో నిర్మించిన భవనం శిథిలావస్థలో ఉండడంతో కూల్చివేశారు. మిగిలిన భవనంలో ఒక గది, వరండా, ప్రధానోపాధ్యాయుడి గది మాత్రమే ఉన్నాయి. పాఠాలు మాత్రం.. ఒక తరగతి గది, వరండాలో జరుగుతాయి. మధ్యాహ్నం వరండాలోకి ఎండపడితే, ఆరుబయట చెట్ల నీడలో పాఠాలు నిర్వహిస్తున్నారు ఉపాధ్యాయులు. ఒకవేళ జల్లులు పడితే అన్ని తరగతులకు ఒకే గదిలో పాఠాలు నిర్వహించాల్సి వస్తుంది.
Read also: Pushpa 2 : పుష్ప 2 థియేటర్లో పెప్పర్ స్ప్రే కలకలం.. ఉక్కిరి బిక్కిరి అయిన ప్రేక్షకులు
దీంతో ఈ సమస్యను ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు ప్రిన్సిపాల్ నీలం సంపత్ కుమార్. దీంతో స్పందించిన ప్రభుత్వ విఫ్ అడ్లూరి రూ.కోటి మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఉపాధి హామీ పథకం నిధుల నుంచి రూ.12 లక్షలు మంజూరుకు హామీ ఇచ్చారని చెప్పారు. ప్రస్తుతం నిధులు మంజూరు అయిన పనులు ప్రారంభించలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. త్వరతిగతిన పనులు ప్రారంభించి గదులు నిర్మించి విద్యార్థుల కష్టాలను తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
CM Chandrababu: డీప్ టెక్ సమ్మిట్ 2024.. సీఎం చంద్రబాబు కొత్త నినాదం..