Pushpa 2 : పుష్ప 2 థియేటర్లో పెప్పర్ స్ప్రే కలకలం.. ఉక్కిరి బిక్కిరి అయిన ప్రేక్షకులు
- పుష్ప 2 థియేటర్లో పెప్పర్ స్ప్రే కలకలం
- ఊపిరాడక పరుగులు తీసిన జనం
- నార్త్ లో దుమ్ములేపుతున్న పుష్ప రాజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pushpa 2 : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా చాలా గ్రాండ్ గా విడుదల అయింది. నార్త్ ఇండియాలో ఈ సినిమా దుమ్ములేపుతోంది. ఇప్పటి వరకు ఏ బాలీవుడ్ స్టార్ కు కూడా సాధ్యం కాని రీతిలో పుష్ప 2 సినిమా మొదటి రోజు వసూళ్లు సొంతం చేసుకుంది. ముఖ్యంగా బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా మొదటి రోజు వసూళ్లను మరే సినిమా బ్రేక్ చేయలేదని ఇప్పటి వరకు అంతా అనుకున్నారు. కానీ పుష్ప రాజ్ ఆ రికార్డ్‌ను బ్రేక్ చేసి ఏకంగా షారుఖ్ ఖాన్‌కే సవాల్ విసిరాడు. ఇంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న పుష్ప 2 క్రేజ్‌ను కొందరు బాలీవుడ్ జనాలు తట్టుకోలేకపోతున్నారు. బాలీవుడ్ ప్రేక్షకులు సైతం కొందరు తమ హీరోల ఆధిపత్యం తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read Also:Pushpa 2 : పుష్ప ఓవర్సీస్ వసూళ్లు ఆల్ టైమ్ టాప్ – 3
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
కొందరు ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా బాహాటంగానే చెబుతున్నారు. పుష్ప 2 సినిమా హిందీ వర్షన్‌పై కొందరు సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్న టైంలో అనూహ్యంగా ముంబైలోని బాంద్రా గెలాక్సీ థియేటర్‌లో పెప్పర్ స్ప్రే ఎటాక్ తీవ్ర కలకలం రేపింది. ఇంటర్వెల్ బ్యాంగ్ కి ముందు గుర్తు తెలియని వ్యక్తి థియేటర్‌లో పెప్పర్ స్ప్రే ను చల్లడంతో అక్కడ ఉన్న ప్రేక్షకులు ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరి అయ్యారు. చాలా మంది దగ్గుతూ థియేటర్ బయటకు పరుగు తీశారు. దాంతో థియేటర్ నిర్వాహకులు దాదాపు 20 నిమిషాల పాటు సినిమాను నిలిపేశారు. లోపల ఉన్న పెప్పర్ ఘాటును తొలగించేందుకు ప్రయత్నించారు.
Read Also:KTR: తెలుగు తల్లి విగ్రహ ఆవిష్కరణకు కేసీఆర్ ను ఎవరో వచ్చి ఆహ్వానిస్తే ఎలా..
ఈ సంఘటనపై పోలీసులకు సైతం ఫిర్యాదు అందించినట్లు తెలుస్తోంది. థియేటర్ యాజమాన్యంతో పాటు కొందరు ప్రేక్షకులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ ఘటనపై కేసు నమోదు అయ్యింది. అనుమానం ఉన్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. పెప్పర్ ఘాటుతో కొంత మంది ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. కొంత సమయం తర్వాత అంతా నార్మల్ అయ్యి సినిమాను పూర్తి చేశారు. ఈ సంఘటనలో ఎవరికి ఏం కాలేదని థియేటర్ యాజమాన్యం ప్రకటించింది. పుష్ప 2 సినిమాపై అక్కసుతో ఇలా చేసి ఉంటారని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?