బీజేపీ చరిత్ర మార్చే కుట్ర చేస్తుంది: జగ్గారెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ పై మరోసారి కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ పై ధ్వజమెత్తారు. బీజేపీ పై ప్రశ్నల వర్షం కురిపించారు. నల్లదనం తెచ్చి పేదల అకౌంట్లలో 15 లక్షలు వేస్తా అన్నారు. ఏమైంది…? తెలంగాణకి వస్తున్న బీజేపీ ముఖ్యమంత్రలు 15 లక్షల ప్రస్తావన ఎందుకు తేవడం లేదు..? బీజేపీ చరిత్ర మార్చే కుట్ర చేస్తుంది తప్పితే చేసింది ఏం లేదని విమర్శించారు. బీజేపీ నాయకులు మాట మీద నిలబడే మనుషులు కాదంటూ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఏం చేసింది అంటుంది… కాంగ్రెస్ చేసినప్పుడు మోడీ పుట్టలేదలేని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.
Read Also: ఏపీ ప్రభుత్వానికి విర్కో గ్రూప్ కంపెనీ భారీ విరాళం
Also Read
వల్లభాయ్ పటేల్ ..సుభాష్ చంద్రబోస్.. కాంగ్రెస్ వాళ్లే అన్న విషయాన్ని బీజేపీ నేతలు గుర్తుపెట్టుకుంటే మంచిదన్నారు. బీజేపీ ఇప్పుడు వల్లభాయ్ పటేల్ విగ్రహం పెట్టి వల్లభాయ్ పటేల్‌ను మేమే గుర్తించామంటూ డబ్బా కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. స్వాతంత్య్రం తెచ్చింది.. కాంగ్రెస్.. సమస్యలు తీర్చింది కాంగ్రెస్… సమస్యలు సృష్టించేది బీజేపీ అంటూ మండిపడ్డారు. బీజేపీకి అసలు విలువలు ఉన్నాయా..? కాంగ్రెస్ గెలిచిన రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని కూల్చి గద్దె నెక్కింది బీజేపీ కాదా..? అంటూ నిప్పులు చెరిగారు. బీజేపీ ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నది.. ఏమైంది..? అంటూ ప్రశ్నించారు. వరి కొనుగోలు సమస్య తెచ్చింది బీజేపీ కాదా.. విచిత్ర ఉద్యమాలు చేస్తోంది బీజేపీ అంటూ జగ్గారెడ్డి బీజేపీపై విరుచుకుపడ్డారు. 2023లో కేసీఆర్ ఎన్నికలకు పోయే అవకాశం ఉండోచ్చు అంటూ జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.
- Tags
- bjp
- congress
- jagga reddy
- telangana
తాజావార్తలు
-
Telangana Exhibitors Association: ఎగ్జిబిటర్స్ కీలక నిర్ణయం.. ‘పెద్ది’ సినిమానే కాదు ఏ సినిమానైనా పర్సంటేజ్ కావాల్సిందే..!
-
Khatti Meethi Dal Recipe: తీపి + పులుపు మ్యాజిక్.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడిగే గుజరాతీ కట్టి మీఠీ దాల్.!
-
Girl Elopes With Lover: ఇంట్లో రక్తం చల్లి మిస్సింగ్ డ్రామా.. అసలు నిజం వింటే షాక్..
-
Kolkata: మమత కట్టడాలపై బుల్డోజర్ చర్య.. సాల్ట్‌లేక్ స్టేడియంలో ఫుట్‌బాల్ శిల్పం తొలగింపు
-
MS Dhoni: ప్లేయర్ కాస్త కోచ్.? చెన్నై సూపర్ కింగ్స్‌కు కోచ్‌గా మిస్టర్ కూల్.!
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!