ఏపీ ప్రభుత్వానికి విర్కో గ్రూప్‌ కంపెనీ భారీ విరాళం

కోవిడ్‌ – 19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం, ఇటీవల వరదల వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో సహాయ చర్యల నిమిత్తం ఏపీ స్టేట్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీకి ఆంధ్రా ఆర్గానిక్స్‌ లిమిటెడ్‌ రూ. 1 కోటి విరాళం అందజేశారు. విరాళానికి సంబంధించిన చెక్‌ను ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌కు విర్కో గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ డైరెక్టర్‌ ఎం.మహా విష్ణు అందజేశారు.

Read Also: రైతులకు కేసీఆర్ చేసిందేమీ లేదు: రామచందర్ రావు

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాల్లో పాలు పంచుకునేందుకు తమ వంతు సాయంగా ప్రభుత్వానికి విరాళం అందజేశామని తెలిపారు. ప్రభుత్వం పేదల కోసం మరిన్ని సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతు వారి అభివృద్ధికి తోడ్పాటును అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి పాల్గొన్నారు.

Related Articles

Latest Articles