TSPSC Paper Leak: తెలంగాణలో సంచలనం సృష్టించిన TSPSC పేపర్ లీక్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా ఈ కేసులో మరో వ్యక్తిని సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు. మున్సిపల్ ఏఈ పరీక్షలో 16వ ర్యాంకు సాధించిన నాగరాజు అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామాపురం గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి రమేష్ వద్ద పేపర్ కొనుగోలు చేసి ర్యాంకు సాధించినట్లు గుర్తించారు. పేపర్ ఇచ్చేందుకు పూల రమేష్ కు నాగరాజు రూ.30 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సిట్ విచారణలో తేలింది. పరీక్షకు ముందు కొంత మొత్తాన్ని అడ్వాన్స్‌గా చెల్లించినట్లు గుర్తించారు. పేపర్ లీక్ ఘటనలో విచారణ జరుగుతుండగా.. నాగరాజు ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు.
Read also:Talasani: ఆటంకం లేకుండా బోనాలు.. సంతోషించిన అమ్మవారు
తాజాగా హైటెక్ మాస్ కాపీయింగ్ కేసులో పట్టుబడిన రమేష్ ఫోన్‌లోని డేటా ఆధారంగా పోలీసులు నాగరాజు ఇంటికి వెళ్లి విచారణ చేపట్టారు. అతడిని విచారించిన అనంతరం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రమేష్ పేపర్‌ను పలువురికి విక్రయించడంతో పాటు తనతో ఒప్పందం కుదుర్చుకున్న ఇన్విజిలేటర్లు, పరీక్షా కేంద్రాల నిర్వాహకులతో కలిసి ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా అభ్యర్థులకు సమాధానాలు కూడా అందించాడు. దాదాపు ఏడుగురు అభ్యర్థులు హైటెక్ మాస్ కాపీయింగ్ ద్వారా పరీక్ష రాశారు. రమేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా.. అతడి వద్ద నుంచి మరికొంత మంది ఏఈ పేపర్ కొనుగోలు చేసినట్లు తేలింది. అభ్యర్థుల ఆర్థిక సంసిద్ధతను బట్టి రమేష్ వారి నుంచి డబ్బులు వసూలు చేశాడు. అతని వద్ద పేపర్ కొనుగోలు చేసిన మరో 30 మందిని త్వరలో అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి.
Swarnalatha Bhavishyavani: గతేడాది నాకు మాట ఇచ్చి ఎందుకు మరిచిపోయారు..!