KTR Warangal Tour: వరంగల్ జిల్లా ప్రభుత్వ చీఫ్ విప్ వినయ భాస్కర్, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఆరూరి రమేష్ మేయర్ గుండు సుధారాణి కుడా చైర్మన్ సుందర్ రాజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. చీఫ్ విప్ వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. ఈనెల 5న వరంగల్ లో కేటీఆర్ పర్యటన ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. మే 5న సాయంత్రం హెలికాప్టర్ లో కిట్స్ కాలేజీ కి చేరుకుంటారని అన్నారు. పేదల సంక్షేమం కోసం వందలకోట్లు కేటాయించడం జరిగిందన్నారు. 181.45కోట్ల పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేస్తారని అన్నారు. కార్మిక ఉద్యోగ మాసోత్సవాల్లో భాగంగా 6960 మందికి లబ్ధి చేకూరడం జరిగిందని అన్నారు. కార్మిక భవనంకు, పూలే భవనానాకి శంకుస్థాపన చేస్తారని అన్నారు. ఆ భవనంలో యువతకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, మహిళలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. స్లమ్ ఏరియాను సందర్శించి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు. బందం చెరువు అభివృద్ధికి శంకుస్థాపన చేస్తారని క్లారిటీ ఇచ్చారు.
Read also: Nehru Zoo Park: బాడ్ న్యూస్.. నెహ్రూ జూపార్క్ టికెట్ల ధరలను భారీగా పెంచిన సర్కార్
సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యాలయం ప్రారంభిస్తారన్నారు. అనంతరం కాజీపేట సెయింట్ గ్రాబియల్ గ్రౌండ్ లో బహిరంగ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. అకాలవర్షంతో రైతులకు అఫార నష్టం వాటిల్లిందని అన్నారు. రైతుకు ఇబ్బంది కలగకుండా సీఎం కేసిఆర్ చర్యలు చేపట్టారని తెలిపారు. నష్టపోయిన అధైర్యపడవద్దు.. రైతులను ఆదుకుంటామని సీఎం కేసిఆర్ భరోసా ఇస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో చిల్లర పార్టీలు చిల్లర రాజకీయాలతో రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. రెచ్చగొట్టే వారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యంతో రైతులు కోలుకోలేని దెబ్బ తగిలిందన్నారు. రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. ఎవరో చెప్పే మాటలు విని రైతులు గాయిగత్తర కావద్దని ధీమా వ్యక్తం చేశారు.
Jeans : మా తల్లే.. ఉతికితే చిరిగిపోద్దని 18ఏళ్లు ఒకటే జీన్స్ వేసుకున్నావా