Theft in Bajaj Showroom: ఎలక్ట్రానిక్స్ షోరూంలో దొంగ దర్జా.. తాపీగా లక్షలు దోచుకెళ్ళిన కేటుగాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Theft in Bajaj Showroom: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఈసీఐఎల్ ప్రధాన కూడలిలో బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూమ్‌ను ఐదేళ్లుగా నిర్వహిస్తున్నారు. ఇక రాత్రి సిబ్బంది విధులు ముగించుకుని వెళ్లిపోయారు. అయితే.. షోరూం ఎడమ వైపున పక్కన భవనానికి.. షోరూం మధ్య కొంత ఖాళీ స్థలం ఉంది. అయితే.. ఇక్కడే షోరూం మూలన వెంటిలేటర్‌కు ఉన్న ఇనుప కడ్డీలను అడ్డుగా ఉన్న ఫాల్ సీలింగ్‌ను తొలగించి భవనంలోకి దొంగలు చొరబడ్డారు. లోపలికి వెళ్లాక అక్కడున్న సీసీ కెమెరాలు పనిచేయకుండా వైర్లను తెంచేశారు.
ఆ తర్వాత 200లకు పైగా ఐఫోన్, వివో, ఒప్పో, వన్‌ప్లస్ సెల్‌ఫోన్లు, ఛార్జర్లు, కేబుళ్లు, ఇయర్ ఫోన్‌లను తీసుకుని.. వాటి డబ్బాలను మాత్రం అక్కడే వదిలేసి పారిపోయారు. అయితే.. సెల్‌ఫోన్లకు పక్కనే ఉన్న యాపిల్ కంప్యూటర్‌ను పరిశీలించి అక్కడే వదిలిపెట్టారు. అక్కడే వున్న ఇతర ల్యాప్‌టాప్‌లు, టీవీలు, ఎలక్ట్రానిక్ వస్తువుల్ని మాత్రం ముట్టుకోలేదు. కాగా.. చోరీకి గురైన వస్తువుల విలువ సుమారు రూ.70 లక్షలకుపైగా ఉంటుందని యాజమాన్యం పేర్కొంది. రోజూలాగానే ఉదయం షోరూంకు వెళ్లిన భద్రతా సిబ్బంది చోరీ విషయం గమనించారు. బజాజ్ ఎలక్ట్రానిక్స్ జనరల్ మేనేజర్ మహ్మద్ హబీబ్ ఇచ్చిన ఫిర్యాదుతో కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. సెప్టెంబర్ 19న ఈఘటన చోటుచేసుకుంది.
Also Read
- వరంగల్ MGMలో ఒక్కసారిగా కుప్పకూలిన సీలింగ్.. ముగ్గురికి గాయాలు!
- Harish Rao : రాష్ట్రంలో రైతు రాజ్యం పోయి రాక్షస రాజ్యం వచ్చింది
- Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో గణపయ్య సందడి.. క్యూలైన్లన్నీ ఫుల్.!
- Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
నగరంలోని కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ కు కూత వేటు దూరంలోని షోరూంలో భారీ చోరీ జరగడం చర్చనీయాంశంగా మారింది. తెలిసిన వ్యక్తులే దొంగతనం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. భవనం లోపల చరవాణులు ఎక్కడుంటాయి..? ఆ విభాగానికి ఎలా వెళ్లాలి.. ఎలా చోరీ చేయాలో ప్రణాళిక ప్రకారం చేసినట్లు భావిస్తున్నారు. డిస్‌ప్లే టేబుల్‌కు ఉన్న సెల్‌ఫోన్‌లను ముట్టుకుంటే బీప్ సౌండ్ వస్తుందని తెలిసి ఎటువంటి శబ్దం రాకుండా చోరీ చేశారు. ఇదంతా.. తెలిసిన వాళ్ల పనా లేదా సెల్‌ఫోన్లు కొనేందుకు వచ్చి పక్కాగా రెక్కీ చేశాకే దొంగతనం చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ ఆధారాలు సేకరించారు. ఇక లోపల ఉన్న సీసీ పుటేజీల్లో దొంగ ఒక్కడు మాత్రమే కనిపించాడు. దొంగ తలకు రుమాలు కట్టుకుని దొంగతనం చేస్తున్న దృశ్యాలు సీసీ పుటేజీల్లో నమోదయ్యాయి. దీంతో.. దొంగతనానికి పాల్పడింది ఒక్కరేనని పోలీసులు ప్రాథమికంగా నిర్థరణకు వచ్చారు పోలీసులు.
Ravi Shastri: ఆ విషయంలో ధోనీనే బెస్ట్
తాజావార్తలు
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా దూరం.. కారణం ఇదే..
-
SIR: వీవీఐపీలకు SIR షాక్.. జైశంకర్, ఆర్మీ చీఫ్, CBI డైరెక్టర్ పేర్లు..
-
Kayadu Lohar: కయాదు వెనుక ఇంత కన్నీటి కథ ఉందా? ‘ప్యారడైజ్’ బ్యూటీ జర్నీ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
-
Sahil Chauhan: 27 బంతుల్లో సెంచరీ.. టీ20 క్రికెట్లో ప్రపంచ రికార్డు.. అతడికి ఇండియాతో సంబంధం ఏంటి..?
-
Ravi Teja: హిట్టు పడగానే రేటు పెంచేసిన మాస్ రాజా.. నిర్మాత డ్రాప్.. సంక్రాంతి సినిమా క్యాన్సల్ ?
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!