TS Entermediate Exam: ఇంటర్ విద్యార్థులకు పరీక్ష రాసేందుకు సమయం రానే వచ్చింది. రేపటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అధికారులు ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు.
ఈనెల 28వ తేదీ నుండి మార్చి 19వ తేదీ వరకు జరుగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టినట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. రాష్ట్రంలో జరుగనున్న ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షల సన్నద్ధతపై జిల్లా కలెక్టర్లు, జిల్లా పోలీస్ అధికారులు, విద్యా శాఖాధికారులు, సంబంధిత అధికారులతో బుధవారం సాయంత్రం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Inter Board Focus: ఇంటర్మీడియట్ థియరీ పరీక్షలు ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్నాయి. 9 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరవుతున్నారు. వచ్చే నెల 18న ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షలకు దాదాపు 5 లక్షల మంది హాజరుకానున్నారు.