ఈ సీజన్‌లో తొలిసారి హైదరాబాద్‌కు రెడ్ అలెర్ట్ జారీ చేసింది ఐఎండీ.. సిటీలో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.. తెలంగాణలోని 14 జిల్లాల్లో శనివారం అతి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. హైదరాబాద్‌లో వాటి ప్రభావం ఎక్కువగా ఉంటుందని.. రెడ్ అలర్ట్ ప్రకటించింది. రానున్న 3 రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఇలాగే ఉండే అవకాశం ఉందని పేర్కొంది ఐఎండీ.. ఇక, తెలంగాణకు రెడ్ అలెర్ట్‌తో పాటు గ్రీన్, ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు కూడా ప్రకటించింది ఐఎండీ.. కాగా, తీవ్రమైన లేదా ప్రమాదకరమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్న సమయాల్లో కంటే దుగా ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఈ హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటుంది ఐఎండీ..
Read Also: Pawan Kalyan: ట్విట్టర్ ట్రెండింగ్ లో పవన్.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం
ఐఎండీ ప్రకటించే నాలుగు రంగు కోడ్‌లను పరిశీలిస్తే.. గ్రీన్ అలెర్ట్ ఇస్తే ఎటువంటి చర్య అవసరం లేదు, అదే ఎల్లో అలెర్ట్ ఇస్తే పరిస్థితి పరిశీలిస్తూ ఉండండి మరియు పరిస్థితి మారే అవకాశం ఉంది, ఆరెంజ్ అలెర్ట్.. ఏ సమయంలోనైనా పరిస్థితి మారిపోవచ్చు జాగ్రత్తగా ఉండేందుకు సిద్ధంగా ఉండండి.. ఇక, రెడ్ అలెర్ట్ – జాగ్రత్తగా ఉండండి, చర్య తీసుకోండి అని ఐఎండీ హెచ్చరిస్తుందన్నమాట.. ఈ హెచ్చరికలను బట్టి కుండపోత వర్షాలు, వరదలు, నదిలో పెరుగుతున్న నీటి మట్టాలు, వరదలతో విధ్వంసాన్ని సృష్టించే సమయంలో కూడా జారీ చేస్తోంది ఐఎండీ.. ఇప్పటికే నిన్న రాత్రి నుంచి హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ముసురు, మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.. ఐఎండీ హెచ్చరికలతో మరో మూడు రోజుల పాటు హైదరాబాద్ సహా తెలంగాణలోని 14 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.. ఇక, సిటీలో ఈ మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది..