Illegal gold in Shamshabad: హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అక్రమ రవాణాకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. శంషాబాద్‌లో ఏదో ఒక అక్రమరవాణా వెలుగులోకి రావడం కలకలం సృష్టిస్తోంది. అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నా అక్రమ రవాణా మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. దీంతో కేటుగాళ్లు అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. దీంతో బంగారం అక్రమ రవాణా పెద్ద ఎత్తున జరుగుతునే ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరో సారి విదేశీ బంగారం పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. అబుదాబి ప్రయాణీకుడి వద్ద 65 లక్షల విలువ చేసే 1221 గ్రాముల బంగారం కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. కస్టమ్స్ అధికారులను బురడి కొట్టించడానికి ప్రయత్నించాడు. అయితే లగేజ్ బ్యాగ్ ను అధికారులు పరిశీలించగా.. లగేజ్ బ్యాగ్ లో బంగారాన్ని ఆభరణాలుగా మార్చి దాచి తరలించే యత్నం చేశాడు కేటుగాడు. దీంతో కస్టమ్స్ అధికారుల స్క్రీనింగ్ లో బయట పడ్డ అక్రమ బంగారం గుట్టైంది. బంగారం స్వాధీనం చేసుకుని బంగారాన్ని సీజ్ చేశారు అధికారులు. అక్రమ బంగారం తరలిస్తున్న ప్రయాణీకుడు అరెస్ట్ చేసి అధికారులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Twin Sisters: ఒకే వ్యక్తిని పెళ్లాడిన కవల సోదరీమణులు.. కారణం తెలిస్తే నోరెళ్లబెడతారు