రంగారెడ్డి జిల్లా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరో సారి విదేశీ బంగారం పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. అబుదాబి ప్రయాణీకుడి వద్ద 65 లక్షల విలువ చేసే 1221 గ్రాముల బంగారం కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు.
ఈమధ్య కాలంలో అంతర్జాతీయ విమానాశ్రయాల్లో డగ్స్, బంగారం పట్టివేత భారీగా జరుగుతోంది. అధికారుల కళ్లుగప్పి అక్రమంగా డ్రగ్స్, బంగారం సరఫరా చేస్తూ అధికారులకు అడ్డంగా దొరికిపోతున్నారు. ఇక తాజాగా చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమ బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బహ్రయిన్ ప్రయాణీకుడి వద్ద రెండు కేజీలకు పైగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. బంగారాన్ని కరిగించి పేస్టుగా చేసి కాళ్లకు వేసుకునే సాక్స్ లోదాచాడు కేటుగాడు. చెన్నై ఎయిర్‌పోర్ట్ లో కస్టమ్స్ అధికారుల తనిఖీలల్లో…