IAS Officers Transfer: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా.. వేచి ఉన్న పలువురు ఐఏఎస్‌లకు కూడా పోస్టింగ్‌లు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ బదిలీలు, పోస్టింగుల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 31 మంది ఐఏఎస్ అధికారులు కొత్త బాధ్యతలు చేపట్టనున్నారు. 1990 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్ హెచ్ఆర్డీ ఇన్స్టిట్యూట్) డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. అదేవిధంగా యువజన సర్వీసులు మరియు పర్యాటక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా శైలజా రామయ్యర్, ఆయుష్ డైరెక్టర్‌గా దాసరి హరిచందన, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిగా కృష్ణ ఆదిత్య నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Also Read : IndvsWI: రికార్డుల కోసమే వెస్టిండీస్ తో మ్యాచ్ ఆడుతున్నట్లు కనిపిస్తుంది..
Also Read
- KCR: ‘నమ్మకమైన ఉద్యమ సహచరుడిని కోల్పోయా’.. సుదర్శన్‌రెడ్డి మృతిపై కేసీఆర్ భావోద్వేగం!
- Peddi Sudarshan Reddy: కేసీఆర్ అడుగుజాడల్లో నడిచిన ఉద్యమ నాయకుడు.. పెద్ది సుదర్శన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఇదే..
- Peddi Sudarshan Reddy: పెద్ది సుదర్శన్ రెడ్డి ఇక లేరు.. చికిత్స పొందుతూ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
- Telangana Govt: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. బకాయిల సొమ్ము రూ.6 వేల కొట్లు విడుదల..
వీరితో పాటు.. తెలంగాణ స్టేట్ ఫుడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ గా సంగీత సత్యనారాయణ, భద్రాచలం ఐటీడీఏ పీఓగా ప్రతీక్ జైన్, సెర్ప్ సీఈవోగా పాత్రు గౌతమ్, గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శిగా నవీన్ నికోలస్, నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా మందా మకరందు, ఐలా త్రిపాఠి. ములుగు కలెక్టర్‌గా, ఐలా త్రిపాఠి పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌గా ఉన్నారు. ముజామిల్ ఖాన్, ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి కె. హరిత లను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read : Jammu& Kashmir: జమ్మూకాశ్మీర్ లో ముగ్గురు వలస కార్మికులను కాల్చి చంపిన ఉగ్రవాదులు..
ఇదిలా ఉంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారత ఎన్నికల సంఘం రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారుల నియామకాన్ని ఖరారు చేసింది. వివిధ జిల్లాల్లోని పరిస్థితిని అంచనా వేయడానికి, కొనసాగుతున్న ప్రచారంలో ఓటర్ల జాబితాలో ఏవైనా లోపాలను సరిదిద్దడానికి ఎన్నికల సంఘం ప్రయత్నాలలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు (ఆర్ఓలు), అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల (ఏఆర్ఓ)ల జాబితాను తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈఓ) వికాస్ రాజ్ విడుదల చేశారు.
తాజావార్తలు
-
GV Prakash : యాక్టర్, మ్యూజిక్ డైరెక్టర్‌గా వరుస ప్రాజెక్టులు.. ఇండియాలోనే ఒక్కడు
-
Ajinkya Rahane Unbeaten Record: భారత క్రికెట్లో అన్‌బీటెన్ రికార్డు.. జయహో జింక్స్.. దిగ్గజ కెప్టెన్లకు కూడా సాధ్యం కాలేదు!
-
8,500mAh బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో ఎంట్రీ ఇస్తున్న Huawei Nova 16 SE.!
-
Nokia 100 (2026): నోకియా 100 విడుదలకు ముందే లీక్.. LED ఫ్లాష్‌లైట్, 1,020mAh బ్యాటరీతో కొత్త ఫీచర్ ఫోన్!
-
కేవలం 6.5 మిమీ మందం, 12.2 అంగుళాల 2.8K OLED డిస్ప్లే, Dimensity 8300 చిప్‌తో ASUS Pad (T3201) భారత్‌లో లాంచ్..!
ట్రెండింగ్
-
Alien Temple: ఏలియన్‌కు ఆలయం.. ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే..!
-
Google Pixel 11 సిరీస్‌లో కొత్త ట్విస్ట్.. లాంచ్‌కు కీలక ఫీచర్స్ లీక్..!
-
WhatsApp Webలో ఆడియో, వీడియో కాలింగ్ సపోర్ట్.. Call Transfer, Waiting Room సహా కొత్త ఫీచర్స్ కూడా.!
-
7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్‌తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!