తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా.. వేచి ఉన్న పలువురు ఐఏఎస్‌లకు కూడా పోస్టింగ్‌లు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ బదిలీలు, పోస్టింగుల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 31 మంది ఐఏఎస్ అధికారులు కొత్త బాధ్యతలు చేపట్టనున్నారు. 1990 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ ఇన్‌స్టిట్యూట్) డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు.
తెలంగాణలో ఆదివారం పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ జరిగింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. లోకల్ బాడీస్ కు అధికారులుగా ఉన్న పలువురు ఐఏఎస్ అధికారులకు కలెక్టర్ గా పదోన్నతి పొందారు. సంగారెడ్డి కలెక్టర్ గా ఉన్న ఏ. శరత్, సిద్ధిపేట కలెక్టర్ గా ప్రశాంత్ జీవన్ పాటిల్, గద్వాల కలెక్టర్ గా కోయ శ్రీహర్ష, నల్గొండ కలెక్టర్ గా రాహుల్ శర్మ, ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారిగా వరణ్…