University of Hyderabad: వరల్డ్ బెస్ట్ యూనివర్సిటీల్లో ఒకటిగా హైదరాబాద్ వర్సిటీ.. 7 అంశాలలో..!
- ప్రపంచంలోని ఉత్తమ విశ్వవిద్యాలయాలలో ఒకటిగా హెచ్‌సీయూ..
- 2025 ఎడిషన్ క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో చోటు..
- ఏడు అధ్యయన అంశాలలో అగ్రశ్రేణి వర్సిటీల్లో ఒకటిగా ఎంపిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
University of Hyderabad: హైదరాబాద్ యూనివర్సిటీ మరోసారి సత్తా చాటింది.. ప్రపంచంలోని ఉత్తమ విశ్వవిద్యాలయాలలో ఒకటిగా నిలిచింది.. 2025 ఎడిషన్ క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో సబ్జెక్టుల వారీగా హైదరాబాద్ విశ్వవిద్యాలయం ఏడు అధ్యయన అంశాలలో ప్రపంచంలోని అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలలో ఒకటిగా ఎంపికకావడం విశేషంగా చెప్పుకోవాలి.. మార్చి 12వ తేదీన దీనికి సంబంధించిన ర్యాంకింగ్స్ విడుదల చేశారు.. ప్రపంచవ్యాప్తంగా 100 ప్రదేశాల్లోని 1,700 విశ్వవిద్యాలయాల్లో 55 విద్యా విభాగాలకు చెందిన విద్యార్థులు తీసుకున్న 18,300 కంటే ఎక్కువ వ్యక్తిగత విశ్వవిద్యాలయ కార్యక్రమాల పనితీరుపై విశ్లేషణతో ఈ ర్యాంకింగ్స్ ప్రకటించారు..
Read Also: SRH Players: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూతురు రిసెప్షన్‌కు ఎస్ఆర్హెచ్ స్టార్ ఆటగాళ్లు.. వీడియో వైరల్!
Also Read
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
- Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
- Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
అయితే, హైదరాబాద్ యూనివర్సిటీ ఏడు సబ్జెక్టులలో ర్యాంక్ పొందింది.. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ (251-300), లింగ్విస్టిక్స్ (301-350), సోషియాలజీ (301-375), కెమిస్ట్రీ (451-500), ఎకనామిక్స్ అండ్ ఎకనామెట్రిక్స్ (501-550), ఫిజిక్స్ అండ్ ఆస్ట్రానమీ (601-675), బయోలాజికల్ సైన్సెస్ (651-700).. ఇలా ఏడు సబ్జెక్టులలో ర్యాంక్స్ సొంతం చేసుకుంది.. దీనిపై స్పందించిన యూనివర్సిటీ వైఎస్ ఛాన్సలర్ ఫ్రొఫెసర్ బీజే రావు.. విశ్వవిద్యాలయానికి ఇది గర్వకారణం అన్నారు.. సబ్జెక్టుల వారీగా QS ప్రపంచ ర్యాంకింగ్స్‌లో హైదరాబాద్ విశ్వవిద్యాలయం ఉన్నత స్థానంలో ఉండటం చాలా సంతోషంగా ఉందన్నారు.. ఈ విజయంతో మేం గర్వపడుతున్నాం.. ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకున్న విభాగాలకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను అన్నారు బీజే రావు.. అయితే, మేం మా విజయాలతో సంతృప్తి చెందలేదు. మరిన్ని విషయాలను అందుకోవడానికి.. ఈ ర్యాంకింగ్స్‌లో మా ఉనికిని విస్తరించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం అన్నారు.. దాని కోసం మేం అవిశ్రాంతంగా పనిచేయడానికి కట్టుబడి ఉన్నాం అన్నారు హైదరాబాద్ యూనివర్సిటీ వీసీ బీజే రావు..
తాజావార్తలు
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!