మళ్లీ మొదలైన లోన్ యాప్స్ అరాచకాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లో లోన్ యాప్స్ అరాచకాలు మళ్లీ మొదలయ్యాయి. వారం రోజుల వ్యవధిలో సిటీ పోలీసులకు 4 ఫిర్యాదులు అందాయి. యూసఫ్‌గూడాకు చెందిన ఓ యువతి లోన్ యాప్ ద్వారా రూ.10 లక్షలు లోన్ తీసుకుంది. అయితే సదరు యువతిని వేధింపులకు గురి చేసి లోన్ యాప్ నిర్వాహకులు అదనంగా రూ.2.9 లక్షలు దండుకున్నారు. అలాగే కృష్ణానగర్‌కు చెందిన మరో మహిళ లోన్ యాప్ నుంచి రూ.33వేలు రుణం తీసుకుంది. అయితే గడువు తీరిందని ఫేక్ నోటీస్ లెటర్ హెడ్లతో కాల్ సెంటర్ నిర్వాహకులు బ్లాక్ మెయిల్ చేశారు.
అంతేకాకుండా కుటుంబీకుల ఫోన్ నెంబర్లను తీసుకొని వాటితో వాట్సాప్ గ్రూప్ తయారు చేసి కాల్ సెంటర్ నిర్వాహకులు బాధితురాలిని వేధించారు. దీంతో వేధింపులు తాళలేక బాధితురాలు తీసుకున్న రూ.33 వేల రుణానికి రూ.లక్ష చెల్లించింది. దీంతో బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉంటే.. ఓల్డ్ సిటికి చెందిన ఆటో డ్రైవర్ గోక్యాష్ లోన్ యాప్ ద్వారా రూ.5వేల రుణం తీసుకున్నాడు. యాప్ కండిషన్స్ తెలియకుండానే బాధితుడు అన్ని షరతులను యాక్సెప్ట్ చేశాడు.
Also Read
దీంతో తిరిగి చెల్లింపులు చేయకపోవడంతో లోన్ నిర్వాహకులు వేధింపులకు గురి చేశారు. దీంతో సదరు ఆటో డ్రైవర్ ఈనెల 19న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే గతంలో కూడా లోన్ యాప్స్ నిర్వాహకుల వేధింపులు భరించలేక చాలా మందే ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కానీ.. లోన్స్ యాప్స్ మాత్రం వాటి తీరును మార్చుకోవడం లేదు. కాల్ సెంటర్ నిర్వాహకులు లోన్ తీసుకున్నవారితో వ్యవహరించే తీరుపై పోలీసులు ఇప్పటికే పలు సూచనలు చేశారు. అయినప్పటికీ వారి తీరు మారడం లేదు.
తాజావార్తలు
-
SRH vs RCB: 300+ లోడింగ్.. మొదట బ్యాటింగ్ చేయనున్న కాటేరమ్మ కొడుకులు.!
-
CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
-
KTR : అసెంబ్లీ రద్దు చెయ్.. ప్రజల తీర్పు ఏంటో చూద్దాం
-
Machilipatnam: కామర్స్ లెక్చరర్ ‘కామ లీలలు’.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్‌గా భార్య ఎంట్రీ..!
-
Education Commission Chairman: విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా.. సీఎస్‌కు లేఖ..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!