లోన్ యాప్ ల వేధింపులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. లోన్ యాప్స్ మొదట్లో బాగానే లోన్స్ ఇస్తున్నాయి. అవి వసూల్ చేసేటపుడు మాత్రం జనాలకు చుక్కలు చూపెడుతున్నాయి. ఈజీగా లోన్ వస్తుందని ఎంతో మంది తీసుకుంటున్నారు. త్వరగా, సులభంగా డబ్బు లభిస్తుండటంతో చాలా మంది వీటిపై ఆధారపడుతున్నారు. అయితే సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఆర్థిక సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. మోసాలు, ఆర్థిక నష్టాల బారిన పడకుండా ఉండటానికి కొన్ని ముఖ్యమైన చిట్కాలు పాటించాలని న్యాయ నిఫుణులు చెబుతున్నారు.…
Unregulated lending: లోన్ యాప్‌ల వేధింపులతో ఎంతో మంది ప్రజలు సూసైడ్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వాటిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకు రాబోతుంది. చట్టబద్ధమైన సంస్థ ద్వారా కాకుండా, భౌతికంగా లేదా ఆన్‌లైన్‌లో లోన్ ఇచ్చే వారికి 10 ఏళ్ల వరకూ జైలు శిక్ష, కోటి రూపాయల జరిమానా విధించేలా ముసాయిదాను మోడీ సర్కారు రూపొందిస్తుంది.
Loan Harassment : ఈ నెల 7వ తేదీన లోన్ యాప్ వేధింపులకు బలైన యువకుడు కుటుంబం నిరసన కు దిగింది.. న్యాయం చేయాలని జిల్లా కలెక్టరేట్ వద్ద లోన్ యాప్ కి బలైన మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కలెక్టర్ కు విన్నవించుకోగా ఆదుకుంటామని హామీ ఇచ్చి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేకపోయిందని వాపోయారు.. నేటికీ 10 రోజులు గడుస్తున్నా బాధిత కుటుంబానికి న్యాయం జరగడం లేదని, ఆ కుటుంబానికి…
ఇటీవల కాలంలో లోన్ యాప్‌ల వేధింపులతో ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి.. అవసరాల కోసం ఆన్‌లైన్ యాప్‌లను ఆశ్రయించిన ఘటనలు కొన్ని అయితే.. వారే పిలిచి మరి లోన్‌లు ఇచ్చి.. తర్వాత వేధింపులకు గురిచేసిన ఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి.. లోన్ ఇవ్వడం.. ఆ తర్వాత రకరకాలుగా వేధింపులకు గురి చేయడంతో.. ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు తీసుకున్నారు. తాజాగా లోన్ యాప్ వేధింపులకు ఓ యువకుడు బలి అయ్యాడు. ఈ ఘటన విశాఖలో చోటుచేసుకుంది.
మంచి సిబిల్ స్కోర్ లేని లేదా చెడు క్రెడిట్ చరిత్ర లేని వ్యక్తులు రుణం పొందడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇది మాత్రమే కాదు.. జీతం రుజువు లేకపోయినా రుణం కోసం బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేకపోతే ఆన్‌లైన్‌లో రుణం తీసుకోవడం కలలాంటిది. కానీ ఇప్పుడు వీటిలో ఏదీ లేకుండానే మీరు ఒక్క క్షణంలో రుణం పొందవచ్చు. ఇందుకోసం యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్‌ఫేస్ (యుఎల్‌ఐ) ప్లాట్‌ఫామ్‌ను రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. ఈ…
Fake Loan Apps: నకిలీ రుణ యాప్‌లలో ప్రజలను ట్రాప్ చేయడానికి మోసగాళ్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగిస్తారు. ఇప్పుడు ప్రభుత్వం ఈ దిశగా కఠిన చర్యలు తీసుకోనుంది.
గూగ్‌ల్ ప్లే స్టోర్‌లో కుప్పలుకుప్పలుగా యాప్స్ ఉంటాయి.. కొన్నిసార్లు.. ఇలాంటి యాప్‌లు కూడా ఉన్నాయా? అనే అనుమానాలను కలిగిస్తుంటాయి.. అయితే, ఎప్పటికప్పుడు గూగుల్.. వాటిని ప్రక్షాళన చేస్తూనే ఉంటుంది.. ఈ మధ్య కాలంలో లోన్ యాప్స్ ఆగడాలు మితిమీరిపోతున్న విషయం విదితమే.. ఈ యాప్స్ వలలో చిక్కుకుని చాలా మంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు.. అయితే, లోన్ యాప్స్ విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది గూగుల్.. మార్గదర్శకాలను ఉల్లంఘిస్తున్న 3500 లోన్ యాప్స్‌ను ప్లేస్టోర్ నుంచి సెర్చింజన్…
ప్రస్తుతం సమాజంలో సెల్ ఫోన్లు చాలా కీలకంగా మారాయని సీపీ సీవి ఆనంద్ అన్నారు. సైబర్ ట్రోలింగ్, వ్యాపార సముదాయాల్లో సైబర్ సెక్యూరిటీ లో అంశాలపై ఈ సమ్మిట్ లో చర్చించారు.
YES Bank : ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకులలో ఒకటైన యస్ బ్యాంక్ తన ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డి) వడ్డీ రేట్లను సవరించింది. రూ.రెండు కోట్ల వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD)పై వడ్డీలో ఈ మార్పు చేపట్టింది.