IAM GAME Trailer : దుల్కర్ సల్మాన్ ‘IAM GAME’ తెలుగు ట్రైలర్ రిలీజ్ చేసిన యంగ్ టైగర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా నహాస్ హిదాయత్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్-ఇండియా చిత్రం ‘ఐయామ్ గేమ్’. గతేడాది కాంతతో నిరాశపరిచిన దుల్కర్ రాబోతున్న ఐయామ్ గేమ్ తో భారీ కొట్టాలని చూస్తున్నాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేసారు మేకర్స్. ట్రైలర్ చూస్తే గ్యాంబ్లింగ్, క్రికెట్ స్కామ్ కథాంశంతో అద్భుతమైన విజువల్స్, మైండ్-బ్లోయింగ్ ఛేజింగ్ సీన్లు, హై-వోల్టేజ్ ఫైట్ సీక్వెన్సులతో ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది.
తెలుగులో ఈ సినిమా ట్రైలర్ ను యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రిలీజ్ చేస్తూ దుల్కర్ సల్మాన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతా ద్వారా స్పందిస్తూ ImGame ట్రైలర్‌లోని వైబ్ చాలా ఫైరీగా ఉంది. మొదటి నుండి చివరి వరకు ఎంతో గ్రిప్పింగ్‌గా, ఆసక్తికరంగా ఉంది. నా బ్రదర్ దుల్కర్ సల్మాన్ మరోసారి ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన చిత్రాన్ని అందించబోతున్నాడని గట్టిగా నమ్ముతున్నాను. ఈ గేమ్ లో తప్పకుండా గెలుస్తాడని ఆశిస్తున్నాను. దుల్కర్‌తో పాటు చిత్ర యూనిట్ మొత్తానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు” అని పేర్కొన్నారు. , దుల్కర్ సల్మాన్ సొంత నిర్మాణ సంస్థ వేఫేరర్ ఫిల్మ్స్ బ్యానర్ పై జోమ్ వర్గీస్ తో కలిసి భారీ బడ్జెట్ పై ఈ సినిమాను నిర్మించారు. కయాదు లోహర్ హీరోయిన్ గా నటిస్తుండగా తమిళ్ డైరెక్టర్ కమ్ నటుడు మిస్కిన్, యాంటోని వర్గీస్, కతిర్ వంటి నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను సౌత్ ఇండియాలో 100కు పైగా లొకేషన్లలో షూట్ చేశారు. ఆగస్టు 20న ఓనం కానుకగా మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది ఐయామ్ గేమ్.
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!