Rythu Runa Mafi: రెండో విడత రైతు రుణమాఫీ.. ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి..
- రెండో విడత రుణమాఫీలో లక్షన్నర రూపాయలు..
- అసెంబ్లీ ఆవరణలో ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..
- సుమారు 7 లక్షల మంది రైతులకు రూ.7 వేల కోట్ల రుణమాఫీ..
- మూడు విడతల్లో రుణమాఫీ పూర్తి చేసేలా ప్రభుత్వం ప్రణాళిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rythu Runa Mafi: ఇవాళ మధ్యాహ్నం అసెంబ్లీ ప్రాంగణంలో లక్షన్నర రూపాయల వరకు రెండో విడత రుణమాఫీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. రెండో దశలో దాదాపు 7 లక్షల మంది రైతులకు రూ.7 వేల కోట్ల రుణమాఫీ చేస్తున్నారు. మొదటి విడత ఈ నెల 19న ప్రారంభమైంది. తొలి విడతలో దాదాపు 10.83 లక్షల కుటుంబాలకు చెందిన పదకొండున్నర లక్షల ఖాతాల్లో రూ.6 వేల కోట్లు జమయ్యాయి. ఆధార్ నంబర్, ఇతర వివరాలు సరిగా లేకపోవడంతో దాదాపు 17 వేల మందికి రుణమాఫీ సొమ్ము అందలేదు. మూడో విడతలో ఆగస్టు 15 నాటికి ఒకటిన్నర నుంచి రెండు లక్షల రూపాయల వరకు రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రుణమాఫీని మూడు విడతల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే..
Read also: CM Revanth Reddy: లక్షల మంది రైతుల ఇండ్లలో సంతోషం.. ఇది మా ప్రభుత్వ చరిత్ర..
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
మూడు విడతల్లో రూ.31 వేల కోట్ల మాఫీ: లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల లోపు పంట రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం సమావేశంలో తెలిపారు. ఆగస్టులోపు రుణమాఫీ చేస్తామన్న సవాల్ ను హరీశ్ రావు స్వీకరించి మాఫీ చేస్తున్నామన్నారు. తొలి విడతలో రూ.6,093 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశారు. రెండో విడతలో రూ.లక్ష వరకు రుణాలు అందజేస్తున్నట్లు తెలిపారు. లక్షన్నర మాఫీ చేస్తామన్నారు. మూడో విడతలో రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని, మూడు విడతల్లో రూ.31 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు. కాగా.. పాస్ బుక్ ఆధారంగానే రుణమాఫీ చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మరోవైపు రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. అయితే రుణమాఫీ సొమ్మును దోచుకునేందుకు సైబర్ మోసగాళ్లు పన్నాగం పన్నుతున్నారు. దీంతో రైతులు తమ ఫోన్లకు వచ్చే మెసేజ్‌లపై క్లిక్ చేయవద్దని సైబర్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. అలా చేస్తే మీ రైతు రుణమాఫీ సొమ్ము దోచుకునే అవకాశం ఉందని, అపరిచిత వ్యక్తులకు బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వవద్దని హెచ్చరించారు.
Nirmal Crime: రన్నింగ్ బస్సులో మహిళపై అత్యాచారం.. నోట్లో గుడ్డలు కుక్కి..!
తాజావార్తలు
-
BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
-
CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఇండియా కూటమిలోకి విజయ్ పార్టీ TVK!
-
Shubman Gill: అదే మా కొంపముంచింది.. ప్రపంచ కప్‌కు ముందు ఇలా ఆడితే..!
-
Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!