3rd Rythu Runa Mafi: మూడో విడత రైతు రుణమాఫీ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఆగస్టు పదిహేనువ తేదీ ఇవాళ ఖమ్మం జిల్లా వైరాలో నిర్వహించే బహిరంగసభలో మూడో విడత రుణమాఫీ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు.
మూడో విడత రుణమాఫీ రేపు ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. మూడో విడత కింద రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు రుణమాఫీని రేపు ఖమ్మం జిల్లా వైరాలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఆ వెంటనే రైతుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి.