TG Weather: తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతుంది. జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో చలి పెరుగుతుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. కొమురం భీం జిల్లా సిర్పూర్ లో 10.5 ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా పొచ్చెరలో 11.8 డిగ్రీలుగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. నిర్మల్ జిల్లా కుంటాలలో 12.6 డిగ్రీలు కాగా.. ఇక మంచిర్యాల జిల్లా ర్యాలీ లో 13.1 గా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయింది. మిగతా జిల్లాల్లోనూ చలిగాలులు వీస్తున్నాయి. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మూడు రోజులుగా రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాల్లో చలి గాలుల తీవ్రత పెరిగింది.
Read also: Rajanna Sircilla: రేపు వేములవాడలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..
రంగారెడ్డి జిల్లా చౌదరిగూడెంలో 12.2 డిగ్రీలు, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, షాబాద్‌లో 12.6 డిగ్రీలు, మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లిలో 13.8 డిగ్రీలు, కుత్బుల్లాపూర్, సమీర్‌పేటలో 14.4 డిగ్రీలు, అత్యల్పంగా 12.2 డిగ్రీలు, వికారాబాద్ జిల్లా మన్నెగూడలో 12.2, వికార్‌బాద్‌లో 12.7 డిగ్రీల ఉష్ణోగ్రత అత్యల్పంగా నమోదైంది. ఇక రాజధాని నగరం హైదరాబాద్‌లోనూ చలి తీవ్రత పెరుగుతోంది. శివారు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి తీవ్రత పెరగడంతో మార్నింగ్ వాకింగ్ చేసే వారి సంఖ్య తగ్గుతోంది. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
Read also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
ఇక ఏపీలోనూ చలి తీవ్రత పెరుగుతోంది. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. ముంచింగిపుట్టులో 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. పాడేరులో 12 డిగ్రీలు, మినుములూరులో 10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పగటిపూట ఎండ ఉన్నప్పటికీ రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. పెరుగుతున్న చలి దృష్ట్యా చిన్నారులు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అత్యవసరమైతేనే రాత్రి, తెల్లవారుజామున బయటకు వెళ్లాలని చెబుతున్నారు.
RGV: ముంచుకొస్తున్న పోలీసుల డెడ్‌లైన్..! ఆర్జీవీ ఏం చేస్తారు..?